Leaders: గుజరాత్ లో ఈ త్రిమూర్తుల భవిష్యత్తు తేలిపోతుంది, ఏ నోటితో తిట్టారో ఇప్పుడు అదే నోటితో జై !
అహమ్మదాబాద్/గుజరాత్: గుజరాత్ కు బీజేపీ కంచుకోట అనే విషయంలో కొన్ని గంటల్లో పక్కా క్లారిటీ వచ్చేస్తోంది. గుజరాత్ లో ఇప్పుడు మూడు నియోజక వర్గాల్లో పోటీ చేసిన త్రిమూర్తుల రాజకీయ భవిష్యత్తు ఈరోజు తేలిపోతుంది. యువతలో మంచి క్రేజ్ సంపాధించుకున్న ముగ్గురు యువ నాయకులు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఢీకొట్టాలని అనేక ప్రయత్నాలు చేసిన ఇద్దరు యువనేతలు చివరికి అదే బీజేపీ తీర్థం పుచ్చుకుని ఏ నోటీతో ప్రధాని మోదీని తిట్టారో అదే నోటీతో ఇప్పుడు మోదీ జిందాబాద్ అనే పరిస్థితికి వచ్చేశారు. అయితే మరో యువ నాయకుడు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీని ఢీ అంటే ఢీ అంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశాడు.

త్రిమూర్తులు
ఆ త్రిమూర్తులు ఎవరో కాదు. హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్. గతంలో గుజరాత్ లో త్రిమూర్తులు అంటే మోదీ, రూపాని, అమిత్ షా. ఈ త్రిమూర్తులను గుజరాత్ లో రామ్ (రూపాని-అమిత్, మోదీ) అని పిలుస్తారు. వీరికి పోటీగా కొంతకాం క్రితం కాంగ్రెస్ లో హెచ్ఏజే (హార్దిక్-అల్పేష్-జిగ్నేష్) అనే యువ నాయకులు తయారైనారు.

మోదీ, అమిత్ షా దెబ్బకు ఫస్ట్ వికెట్
హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని, అల్పేషం ఠాకూర్ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులను బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. అయితే మోదీ, అమిత్ షా దెబ్బతో ఈ త్రిమూర్తులకు సినిమా కనపడింది. 2019లో అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయి మోదీ జిందాబాద్ అని అన్నారు.

విమర్శించిన నోటితోనే మోదీ జిందాబాద్
2022లో గుజరాత్ శాసన సభ ఎన్నికలు జరిగే కొన్ని నెలల క్రితం హార్దిక్ పటేల్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా జపం చేశారు. పటీదార్ కులంలో హార్దిక్ పటేల్ కు ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ కు బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంతో ఇద్దరూ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు.

పుట్టింటిలోనే ఉండిపోయిన జిగ్నేష్
ఇక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన జిగ్నేష్ మేవానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో ఆయనకూడా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు. హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ లకు కాంగ్రెస్, ఆప్ పార్టీల అభ్యర్థులు గట్టిపోటీ చేస్తున్నారు. ఇక్ జిగ్నేష్ మేవానికి కూడా బీజేపీ, ఆప్ అభ్యర్థులు గట్టిపోటీ ఇస్తున్నారు.

చివరి రౌండ్ లో ఏమైనా జరిగితే ?
ఈ త్రిమూర్తులు వేర్వేరు పార్టీలతో పోటీ చేశారు. ఈ ముగ్గురు విజయం సాధిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఓట్ల లెక్కింపులో ఏ రౌండ్ లో అయినా ఏమైనా జరిగే అవకాశం ఉండటంతో ఈ త్రిమూర్తులు ఫలితాల కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని రాజకీయ భవిష్యత్తు తేలిపోనుంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications