వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్కింటివారికి కరోనా వస్తే.... కంగారు వద్దు... ఈ జాగ్రత్తలతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి...

|
Google Oneindia TeluguNews

గత ఆర్నెళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో ప్రజల్లో ఎంత భయముందో... ఇప్పటికీ అంతే భయం నెలకొంది. అయితే పరిస్థితుల్లో మాత్రం కొంత మార్పు వచ్చింది. పక్క వీధిలో కరోనా వచ్చిందంటేనే బెంబేలెత్తిపోయి బంధువుల ఇళ్లకు వెళ్లినవారు సైతం ఇప్పుడు కాస్త ఆలోచిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లకుండా ఉన్నచోటే సరైన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా తమ దరి చేరకుండా తమను తాము కాపాడుకుంటున్నారు. పక్కింటి వ్యక్తులకు కరోనా వచ్చినా సరే... సరైన అవగాహన,జాగ్రత్తలతో కరోనా బారినపడకుండా జాగ్రత్తపడవచ్చు. ఆ జాగ్రత్తలేంటో ఒకసారి పరిశీలిద్దాం...

ఫేస్ మాస్క్‌తో పాటు ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

ఫేస్ మాస్క్‌తో పాటు ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఇంటి బయట అడుగుపెడితే ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. వీలైతే చేతులకు గ్లవ్స్ ధరించడం కూడా మంచిది. అలాగే భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. లిఫ్టులో వెళ్లేటప్పుడు ఇద్దరి కంటే ఎక్కువమంది వెళ్లవద్దు. లిఫ్టులో ఎక్కువమంది ఉన్నప్పుడు మెట్ల దారిని ఉపయోగించడం మంచిది. మెట్ల గుండా వెళ్లేటప్పుడు ఆ గోడను పట్టుకుని నడవద్దు.

వెంట శానిటైజర్ తప్పనిసరి...

వెంట శానిటైజర్ తప్పనిసరి...

చేతులతో తరుచూ టచ్ చేసే డోర్హ్యాం డిల్స్,టేబుల్స్,స్విచ్చులు,ఇతరత్రా వస్తువులను తరుచూ శుభ్రపరుస్తూ శానిటైజర్‌తో డిస్‌ఇన్ఫెక్ట్ చేయాలి. ఎక్కడికెళ్లినా మీ జేబులో ఓ శానిటైజర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లండి. ఏ వస్తువును ముట్టుకున్నా వెంటనే శానిటైజ్ చేసుకోవడం మరిచిపోకండి.

చేతులతో ముఖాన్ని తాకవద్దు...

చేతులతో ముఖాన్ని తాకవద్దు...

వీలైనంతవరకు మీ చేతులను ముఖానికి దూరంగా ఉంచండి. మీరు రైట్ హ్యాండ్‌ని ఉపయోగించేవాళ్లయితే... లెఫ్ట్ హ్యాండ్‌తో వస్తువులను ముట్టడం,డోర్ తీయడం ఇతరత్రా అలవాటు చేసుకోండి. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ వాళ్లయితే వస్తువులను టచ్ చేసేందుకు రైట్ హ్యాండ్‌ ఉపయోగించడం మంచిది. తద్వారా మీరు తరుచుగా ఉపయోగించే చేతితో మీ ముఖాన్ని ముట్టుకున్నా వైరస్ సోకే అవకాశం ఉండదు.

Recommended Video

India’s Overall Growth For 2020-21 Projected at Minus 4.5%: RBI || Oneindia Telugu
పక్కింటివారికి కరోనా వస్తే...

పక్కింటివారికి కరోనా వస్తే...

ఒకవేళ మీ పక్కింటివాళ్లు కరోనా బారినపడితే ఎక్కువగా కంగారు పడకండి. చిన్నపిల్లలు ఉంటే వారిని బయటకు వెళ్లనివ్వకండి. రోజులో రెండుసార్లు ఐదు నిమిషాల చొప్పున ఆవిరి పట్టండి. గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించండి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సీ విటమిన్ ఉండే పళ్లను తీసుకోండి. ఇంటి వద్దే ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్స్‌ను తయారుచేసుకుంది. ఇమ్యూనిటీని పెంచుకునేలా మీ డైట్‌ను ప్లాన్ చేసుకోండి.

English summary
As the novel coronavirus continues to spread at a breakneck spread (infecting more than 23 million people globally), the chances of running into a coronavirus positive patient are becoming increasingly high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X