వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో జెఎన్‌యు విద్యార్థి అదృశ్యం: క్యాంపస్ వీడుతూ..

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జవహర్‌‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)కు చెందిన విద్యార్థి కనిపించుకుండా పోయాడు. అదృశ్యమైన విద్యార్థుల్లో ఇతను రెండవ వాడు. ఇంతకు ముందు నజీబ్ అహ్మద్ అనే విద్యార్థి కనిపించుకుండా పోయాడు.

తాజాగా అదృశ్యమైన స్కాలర్‌ను ముకుల్ జైన్‌గా గుర్తించారు. ఘజియాబాద్‌కు చెందిన అతను సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతను ప్రతి రోజూ ఘజియాబాద్ నుంచి విశ్వవిద్యాలయానికి వస్తుంటాడు.

సోమవారం సాయంత్రం క్యాంపస్‌ నుంచి వెళ్లిపోయినట్లు సిసీటివిలో రికార్డయింది. అంతకు ముందు ఘజియాబాద్‌లోని ఇంటికి వెళ్లాడు. లాబొరేటరీకి వెళ్తూ అతను చివరిసారి కనిపించాడు.

వ్యాలేను, ఫోన్‌ను అతను గదిలోనే ఉంచేసి వెళ్లిపోయినట్లు సహ విద్యార్థులు పోలీసులకు చెప్పారు. ముకుల్ జైన్ జెఎన్‌యులోని లైఫ్ సైన్సెస్ విభాగంలో పరిశోధక విద్యార్థి.

ఇంతకు ముందు నజీబ్ జెఎన్‌యులోని మహి - మండవి హాస్టల్‌ నుంచి కనిపించకుండా పోయాడుు. ఆ సంఘటన 2016 అక్టోబర్ 15వ తేదీన చోటు చేసుకుంది. మరో వర్గానికి చెందిన విద్యార్థులతో ఘర్షణ పడిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు.

English summary
After Najeeb Ahmed, another Jawaharlal Nehru University (JNU) student has gone missing.The student identified as Mukul Jain, a resident of Ghaziabad, is missing since Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X