కర్ణాటక ఎన్నికలు: ఆజ్‌తక్ సర్వేలో కాంగ్రెస్‌కు 118 , బిజెపికి 92 సీట్లు

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో శనివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఆజ్‌‌తక్ సర్వే లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంటుందని తేల్చి చెప్పింది. ఈ సర్వే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంటుందని ఈ సర్వే తేల్చింది.

ఈ సర్వే ప్రకారంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 106 నుండి 118 సీట్లు, బిజెపికి 79 నుండి 92 సీట్లు దక్కే అవకాశం ఉంది. జెడి(ఎస్‌)కు 22 నుండి 30 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అతి చేరువలోకి దగ్గరకు చేరుకొందని చెప్పారు.

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరుసగా రెండో దపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అయితే ఈ ఎగ్జిట్ ఫలితాలు నిజమైతే అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కనుంది. అయితే జెడి (ఎస్) ఏ పార్టీకి మద్దతిస్తోందోననే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Karnataka Elections 2018 Exit Poll Results – AAP, BJP, Congress and Others

పోలింగ్ రోజున ఓటు వేసిన తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకోబోమని మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవేగౌడ్ ప్రకటించారు. అయితే మే 15 తర్వాత ఏ రకమైన రాజకీయ సమీకరణాలు మారుతాయో చూడాల్సిన అవసరం ఉంది.

మొత్తానికి కర్ణాటక ఎన్నికల్లో జెడి(ఎస్) కింగ్ మేకర్ గా మారే అవకాశం లేకపోలేదు. అయితే జెడి(ఎస్) ఏ పార్టీతో పొత్తుకు సై అంటుందనే విషయమై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+