వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో కరోనా విలయం: ఒక్కరోజులో అత్యధికంగా 55వేల కేసులు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంగళవారం కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా, 55వేలకుపైగా కొత్త కేసులు రావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మిగితా రాష్ట్రాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా కేరళలో మాత్రం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో అత్యధిక రోజువారీ కోవిడ్‌ కేసులలో కేరళలో మంగళవారం 55,475 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందు జనవరి 20న ఒక్కరోజులో అత్యధికంగా 46,387 కేసులు నమోదయ్యాయి. నేటి సంఖ్యతో మొత్తం కేసుల సంఖ్య 57,25,086కి చేరుకుంది.

Kerala reports highest-ever single-day Cornavirus surge with over 55,000 cases.

ఎర్నాకుళం జిల్లాలో మంగళవారం అత్యధికంగా 9,405 కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురంలో 8,606, త్రిస్సూర్ 5,520 కేసులు వెలుగుచూశాయి.

"ఈ రోజు సోకిన వారిలో 139 మంది బయటి నుంచి రాష్ట్రానికి చేరుకోగా, 51,547 మంది వారి కాంటాక్టుల నుంచి వ్యాధి బారిన పడ్డారు. 3,373 మంది రోగుల సంక్రమణ మూలాలు ఇంకా నిర్ధారించబడలేదు. సోకిన వారిలో 506 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు" అని రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

గత 24 గంటల్లో 1,12,281 నమూనాలను పరీక్షించినట్లు, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 44%గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం 154 కరోనా వైరస్ సంబంధిత మరణాలు సంభవించాయి, మరణాల సంఖ్య 52,141 కు చేరుకుంది.

తాజా మరణాలలో, గత కొన్ని రోజులుగా 70 నమోదయ్యాయి, కేంద్రం కొత్త మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా అప్పీళ్లను స్వీకరించిన తర్వాత 84 మందిని కోవిడ్ మరణాలుగా గుర్తించారు.

కాగా, మంగళవారం నాటికి 30,226 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 53,86,868కి చేరుకుంది. సోమవారం కేరళలో 26,514 కొత్త కేసులు నమోదయ్యాయి

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గినప్పటికీ.. 3 లక్షలపైనే కొత్త కేసులు వెలుగుచూశాయి.
తాజాగా దేశంలో 3,06,064 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే ఈరోజు 27,469 కేసులు త‌క్కువ‌గా న‌మోదుకావ‌డం ఊర‌ట‌నిచ్చేవిష‌యం. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో క‌రోనాతో 439 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. ఇక‌, 24 గంట‌ల్లో 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది. కేసులు కొంత మేర త‌గ్గుతున్నా పాజిటివిటీ రేటు భారీగా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

English summary
Kerala reports highest-ever single-day Cornavirus surge with over 55,000 cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X