• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఎస్ లాగే ఆరెస్సెస్ : అభిప్రాయాలను ద్వేషించేవారిని శత్రువులు ? టీఎన్ పీసీసీ చీఫ్ కామెంట్స్

|

న్యూఢిల్లీ : ఎన్నికల వేళ కాంట్రవర్సీ కామెంట్లు ఎక్కవవుతున్నాయి. నేతల నోటిదురుసు పీక్‌కి చేరుతోంది. ఎస్పీ నేత ఆజాంఖాన్ సహా మిగిలిన నేతలు మితిమీరి వ్యాఖ్యానిస్తున్నారు. వీరి ప్రచారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా .. వారి తీరులో మాత్రం మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

కాంట్రవర్సీ కామెంట్స్

కాంట్రవర్సీ కామెంట్స్

తాజాగా తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందు ఎజెండాతో పనిచేస్తోన్న ఆరెస్సెస్ ను ఐఎస్ ఉగ్రవాద సంస్థతో పోల్చి తేనేతుట్టెను కదలించారు. ఐఎస్ లానే ఆరెస్సెస్ కూడా తమ శత్రువు అభిప్రాయాలను ద్వేషిస్తోందని కామెంట్ చేశారు. అళగిరి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపింది. దీనిని విపక్ష బీజేపీ నేతలు తప్పుపట్టారు. అళగిరి తన సొంత అభిప్రాయాన్ని అందరిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

సపోర్ట్ చేస్తున్నా ..

సపోర్ట్ చేస్తున్నా ..

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని .. పూర్తిగా మద్దతిస్తున్నట్టు అళగిరి స్పష్టంచేశారు. 100 శాతం కాదు వెయ్యి శాతం కమల్ వ్యాఖ్యలు సరైనవని స్పష్టంచేశారు. ఆరెస్సెస్ హిందూయిజం ఐఎస్ ఇస్లానికి తీసిపోదనన్నారు. అరబ్ దేశాల్లో ఉన్న ముస్లింలు ఐఎస్ అభిప్రాయాలతో విభేదిస్తే .. బహిష్కరణ చేస్తారని గుర్తుచేశారు. భారతదేశంలో ఆరెస్సెస్ కూడా హిందువులపై అదే పద్ధతిని అనుసరిస్తోందని గుర్తుచేశారు. వారి మతం, విధానాలు అంతా ఒక్కటేనని ... ఏ మార్పులేదని నొక్కివక్కానించారు. అయితే అళగిరి వ్యాఖ్యలను ఆరెస్సెస్ తోసిపుచ్చింది. అళగిరి పసలేదని వాదనలు చేస్తున్నారని ఖండించింది. ఆరెస్సెస్, జనసంఘ్, హిందు మహాసభ ... తమ అభిప్రాయాలను విభేదించేవారిని బహిష్కరిస్తుంది తప్ప .. అందరినీ కాదని తేల్చిచెప్పింది.

కమల్ కాంట్రవర్సీ కామెంట్స్

కమల్ కాంట్రవర్సీ కామెంట్స్

నిన్న తమిళనాడులోని ఆరవకురిచి ర్యాలీలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో మొదటి ఉగ్రవాది హిందువు అని చెప్పారు. గాంధీని కాల్చిన గాడ్సే ఉగ్రవాదని ... గాంధీ విగ్రహాం ఎదుట చెప్తున్నానని హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారని అలా అనడం లేదని క్లారిటీ ఇచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Congress chief KS Alagiri on Monday compared right-wing organisation Rashtriya Swayamsevak Sangh (RSS) with the militant group Islamic State (IS). Speaking to India Today TV, KS Alagiri said that like the IS, RSS also hates those who oppose its thoughts. The Congress leader said this while extending his support to Makkal Needhi Maiyam (MNM) founder Kamal Haasan's 'India's first terrorist was a Hindu' remark. He was referring to Mahatma Gandhi's killer Nathuram Godse. KS Alagiri said, "I support and agree Kamal Haasan's statement, not only 100 per cent but 1,000 per cent."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more