Coronavirus: సీఎంకు కరోనా పాజిటివ్, మంత్రులతో మీటింగ్, టెస్ట్ లకు క్యూ, ఐఏఎస్, ఐపీఎస్ లు !
భోపాల్/ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడాలిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి మాజీ ప్రధానులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో రాజకీయ నాయకులు హడలిపోతున్నారు. ప్రతినిత్యం కట్టుదిట్టమైన భద్రతతో ఉండే సీఎంకే కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో మధ్యప్రదేశ్ లోని మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు హడలిపోయారు. తనతో ఇన్ని రోజులు ఎవరెవరు టచ్ లో ఉన్నారో ప్రతిఒక్కరు కరోనా వైరస్ పరీక్షలు చేసుకోవాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా సోషల్ మీడియాలో మనవి చేశారు.
రెండు రోజుల క్రితమే సీఎం చౌహాన్ సీనియర్ మంత్రులతో సమావేశం కావడంతో మంత్రులకు కరోనా కలవరం మొదలైయ్యింది.
Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

సీఎంకు అనారోగ్యం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వల్ప అనారోగ్యానికి గురైనారు. ఓ కాలేజ్ సంబంధించన కార్యక్రమం రద్దు చేసుకున్న తరువాత కరోనా లక్షణాలు కనపడటంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు అనుమానం వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని దృవీకరించారు.

అవును నిజమే... మీరు జాగ్రత్త
తనకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, ఇన్ని రోజులు తనతో సన్నిహితంగా ఉన్న వారు ప్రతిఒక్కరు వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా ట్వీట్ చేశారు. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హోమ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. తాను క్వారంటైన్ నియమాలు పాటిస్తానని, మీరు కూడా ఆ నియమాలు కచ్చితంగా పాటించాలని సీఎం చౌహాన్ ప్రజలకు, మంత్రులకు మనవి చేశారు.

మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ లు క్యూ
రెండు రోజుల క్రితం (బుధవారం) సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా, ఆరోగ్య శాఖా మంత్రి విశ్వాస్ సారంగ్ తదితరులు సమావేశం అయ్యి చర్చించారు. హోమ్ మంత్రి, ఆరోగ్య శాఖా మంత్రితో పాటు ఇన్ని రోజులు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో అధికార కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వివిద శాఖల అధికారులు ప్రస్తుతం కరోనా వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో మొత్తం 26, 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. శుక్రవారం ఒక్కరోజులో 736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 177 కరోనా పాజిటివ్ కేసులు ఒక్క భోపాల్ లోనే నమోదైనాయి.

అధికారులు అలర్ట్
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారిక నివాసం, ఆయన కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న ప్రాంతంలో శానిటైజ్ చేసిన అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు 791 మంది కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. భోపాల్, సాగర, ఇండోర్, మోరోనా, జబల్ పూర్, నీమూబ్, హర్దా సాట్నా తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయని అధికారులు తెలిపారు.