వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ముంబై పోలీసు అధికారికి వైరస్, నాసిక్ ఆస్పత్రిలో చికిత్స.. ఎలా సోకిందంటే...

|
Google Oneindia TeluguNews

ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రార్థనలతో దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే విదేశీ ప్రతినిధులు, వారికి ఆశ్రయం ఇచ్చిన వారిపై పోలీసులు దృష్టిసారించారు. అలా 21 మందిని ముంబై సీనియర్ ఇన్‌స్పెక్టర్ పట్టుకొన్నారు. వారిని పట్టుకొన్న తర్వాత.. పోలీసు అధికారికి కరోనా లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షలు చేసుకోవడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

ఢిల్లీలోగల నిజాముద్దీన్ ఏరియాలో తబ్లిగ్ జమాత్ సభ్యులు గతనెలలో మత సభలు నిర్వహించారు. విదేశీ ప్రతినిధులు రాగా.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అక్కడికి వచ్చిన విదేశీ ప్రతినిధులు ఇండోనేషియా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందినవారు. వారికి కరోనా వైరస్ ఉందనే అంశం కలకలం రేపింది. దీంతో విదేశీ ప్రతినిధులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ పోలీసు అధికారి విదేశీ ప్రతినిధులు మొత్తం 21 మంది అరెస్ట్ చేశారు.

Maharashtra cop who held 21 Tablighi Jamaat members tests positive

వీరిలో 13 మంది బంగ్లాదేశీయులు, 8 మంది మలేషియాకు చెందిన వారు ఉన్నారు. వీరంతా తమిళనాడు తర్వాత మహారాష్ట్రంలోని ముంబ్రాకు వెళ్లారు. మసీదు, పాఠశాలలో దాక్కొని ఉన్నారు. లొంగిపోవాలని ప్రభుత్వం విన్నవించినా లెక్కచేయలేదు. దీంతో ముంబై ఇన్ స్పెక్టర్ రంగంలోకి దిగారు. మసీదులో నక్కిన 21 మందిని అరెస్ట్ చేశారు. సమాచారం ఇవ్వాలని కోరినా స్పందించని మసీదు, పాఠశాల ధర్మకర్తలపై కేసు నమోదు చేశారు.

Recommended Video

PM Modi Thanks To Rohit Sharma, Mithali Raj For Contributing To PM-CARES Fund

తర్వాత ఇన్ స్పెక్టర్‌కు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో నాసిక్ అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

English summary
senior police inspector, who held 21 foreign nationals and also the Tablighi Jamaat members, in Mumbra, Maharashtra has tested positive for coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X