వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో అయిదేళ్లు మోడీ ప్రధాని, సిద్దంగా ఉండు మమతాజీ : అమిత్ షా

|
Google Oneindia TeluguNews

మరో అయిదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా నరేంద్రమోడి రాబోతున్నారు కాసుకొండి అంటూ అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రతి సమాధానం చెప్పారు బీజేపీ చీఫ్ అమిత్ షా. ఎన్నికల ప్రచార ర్యాలీ సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌పైరీ పీఎం అంటూ వ్యాఖ్యలు చేసిన మమతపై అమిత్ షా ఘాటుగా స్పందించారు.

మోడీ, మమత ఫోన్ వివాదం

మోడీ, మమత ఫోన్ వివాదం

ఫోని తుఫాన్ బీభత్సం తగ్గుముఖం పట్టినా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీకి మధ్య తలేత్తిన తుఫానుకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. తుఫాన్ నేపథ్యంలోనే చెలరేగిన రాజకీయ ఆరోపణలు రెండు ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య మరింత వివాదం మరింత ముదురుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఫోని తుఫాన్ ప్రభావంపై ఆ రాష్ట్ర్ర ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ప్రధాన నరేంద్ర మోడీ ప్రయత్నించినా స్పందించలేదని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మమత బెనర్జీపై విరుచుకుపడ్డారు.

ఎక్స్‌పైరీ పీఎం తో నేను మాట్లాడను ,

ఎక్స్‌పైరీ పీఎం తో నేను మాట్లాడను ,

దీంతో ప్రధానికి తిరుగు సమాధానం చెప్పిన మమత ఎక్స్‌పైరీ పీఎం తో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదంటూ ప్రకంటించింది. అవసరమైతే తుఫాన్ ప్రభావంపై రానున్న పీఎం తో మాట్లాడతానని తేల్చి చెప్పింది. ఈనేపథ్యంలోనే ఆయన ఎన్నికల ప్రచారంలో వచ్చిన ప్రధానితో నేను వేదికక పంచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలోనే మోదీని ప్రధానిగా అంగీకరించనని ప్రకటించింది.

కాబోయో పీఎం మళ్లి మోడియో వస్తున్నాడు సిద్దంగా ఉండు

కాబోయో పీఎం మళ్లి మోడియో వస్తున్నాడు సిద్దంగా ఉండు

మమత వ్యాఖ్యల నేఫథ్యంలోనే నేడు ఎన్నికల ర్యాలీలో పాల్గోన్న అమిత్ షా ఘాటుగా స్పందించారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత నువ్వు అంగికరించినా లేక పోయినా ఇబ్బంది ఏమీ ఉండదని , దీంతో మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారని అందుకు మమతా సిద్దంగా ఉండాలని అమిత్ షా అన్నారు. ఈనేపథ్యవోనే మమతాజీ మీకు రాజ్యంగం మీద నమ్మకం ఉందా అంటూ ప్రశ్నించారు. రాజ్యంగబద్దంగా ఎన్నికైన ప్రధానిని మీరు ఆమోదించరా అంటూ ప్రశ్నించారు.

English summary
Be prepared for another five years as Modi is going to become the Prime Minister once again," Amit Shah hits back at Mamata amid massive cheers and chants of "Modi-Modi" by the BJP supporters present at the rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X