వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటలు రావట్లేదు: మోడీ దిగ్భ్రాంతి, వారిపై చర్యలు: ఓ ప్రయాణీకుడు ఏమన్నాడంటే..

యూపీలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏ 1, ఎస్ 1, ఎస్ 2, ఎస్ 3, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, జీఎస్‌, బీ 1, బీ 2, బీ 3, బీ 2, లగేజీ ర్యాక్‌.. పట్టాలు తప్పాయి.

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏ 1, ఎస్ 1, ఎస్ 2, ఎస్ 3, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, జీఎస్‌, బీ 1, బీ 2, బీ 3, బీ 2, లగేజీ ర్యాక్‌.. పట్టాలు తప్పాయి.

రైలు ప్రమాదంపై ఓ ప్రయాణీకుడు మాట్లాడారు. మూడు గంటల సమయంలో రైలు పట్టాలు తప్పిందని చెప్పారు. తాను కోచ్ నెంబర్ 5లో ఉన్నానని తెలిపారు. తనతో పాటు ఉన్న నలుగురైదుగురు కనిపించడం లేదన్నారు. ప్రమాదం సమయంలో తమ గుండె ఆగినంత పనయిందని, తాము మహాకాల్ వల్లే బతికి బయటపడ్డామన్నారు.

narendra modi

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

రైలు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం పైన తనకు మాటలు రావడం లేదని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడానని, ఆయనే స్వయంగా దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అధికారులందరూ తక్షణం ప్రమాదస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా అక్కడికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు. రైల్వే సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

English summary
Prime Minister Narendra Modi on Sunday condoled the loss of lives in the Patna-Indore Express, which has left close to 45 people dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X