• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

|

కొచ్చి/ చెన్నై/ న్యూఢిల్లీ: కరోనా (COVID 19) కాలంలో దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన కేరళ కుట్టి స్వప్న సురేష్ ఆంటీ కథ క్లైమాక్స్ కు చేరుతోందని తెలిసింది. యూఏఇ నుంచి రూ. 15 కోట్ల బంగారం స్మగ్లింగ్ తరలిస్తూ పట్టుబడిన స్వప్న సురేష్ ఆంటీ గ్యాంగ్ గత 8 నెలల్లో రూ. 100 కోట్ల బంగారం స్మగ్లింగ్ చేసిందని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఇంతకాలం కిందనుంచి పై వరకు మేకప్ వేసుకుని రంగురంగుల సిల్క్ చీరలు, జీన్స్ ప్యాంట్ లు, అదిరిపోయే డ్రస్సులు వేసుకున్న స్వప్న సురేష్ నేడు ఎన్ఐఏ అధికారుల దెబ్బకు డ్రమ్ముకు బ్లాక్ డ్సస్ వేసినట్లు ఉంది. ఇంతకాలం వేలాది రూపాయల విలువైన డ్రస్సులు వేసుకుని ఫోజులు కొట్టిన స్వప్న సురేష్ నేడు ఎన్ఐఏ అధికారులు విడుదల చేసిన ఫోటోల్లో ఆమె దీనంగా నిలబడి ఉండటంతో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. స్వప్న సురేష్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 సీఎం పంచె తడిసిపోయింది

సీఎం పంచె తడిసిపోయింది

ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో ఉన్న UAE కాన్సూలేట్ కార్యాలయానికి వస్తున్న 35 కేజీల బంగారంను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేష్ కు కేరళ సీఎం పినరయి విజయన్ అండగా ఉన్నారని, ఆయన రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. స్వప్న సురేష్ కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో కీలకపదవిలో ఉండటంతో కేరళ సీఎం పినరయి విజయన్ కు దిక్కుతోచక ఆయన పంచె తడిసిపోయినంత పని అయ్యింది.

 ఎన్ఐఏ ఎంట్రీతో థ్రిల్లర్ సినిమా

ఎన్ఐఏ ఎంట్రీతో థ్రిల్లర్ సినిమా

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేతికి వెళ్లడంతో కథ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఎన్ఐఏ అధికారులతో పాటు కస్టమ్స్, ఈడీ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్ఐఏ అధికారులు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా తమిళనాడులోని తిరుచ్చి చేరుకుని అక్కడ ఓ వీఐపీతో పాటు మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ తోపాటు మొత్తం 20 మందిని అధికారులు అరెస్టు చేశారని తెలిసింది.

 నేను ముద్దమాందారం, ముట్టుకుంటే !

నేను ముద్దమాందారం, ముట్టుకుంటే !

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు స్వప్న సురేష్ తో పాటు ఆమె సహచరులను కొచ్చిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, నేను ముద్దమందారం అని, ముట్టుకుంటే కందిపోతాను తప్పా తనకు ఏపాపం తెలీదని స్వప్న సురేష్ బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు మనవి చేసింది. కోర్టు ముందు స్వప్న సురేష్ అమాయకురాలిగా నటించింది.

 రూ. 100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ !

రూ. 100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ !

స్వప్న సురేష్ కు బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్ఐఏ అధికారులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. 2019 నవంబర్ నెల నుంచి 2020 జూన్ నెలవ వరకు స్వప్న సురేష్, ఆమె సహచరులు A1 to A5 నిందితులైన సారథి, సురేష్, ఫైసల్ ఫరీద్, సందీప్ నాయర్, రమేష్ తదితరులు రూ. 100 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేశారని విచారణలో వెలుగు చూసిందని, ఇప్పుడు వీరికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చెయ్యకూడదని ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు.

పైన పండ్లు, కింద ?

పైన పండ్లు, కింద ?

యూఏఇలో ఉంటున్న ఫైసల్ ఫరీద్ కేరళకు అనేక పార్శిల్స్ పంపిస్తున్నాడని, పైన అనేక వస్తువులు, పండ్లు పెట్టి లోపల గుట్టుచప్పుడు కాకుండా బంగారం బిస్కెట్లు పెట్టి భారత్ కు సరఫరా చేస్తున్నాడని తమ విచారణలో వెలుగు చూసిందని ఎన్ఐఏ అధికారులు కోర్టులో చెప్పారు. స్వప్న సురేష్ తో పాటు ఆమె గ్యాంగ్ లోని వాళ్లు క్రిమినల్స్ అని, వారికి బెయిల్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని, ఈ వ్యవహారంలో ఉన్న వాళ్లు అందరూ బయటకు రావాలంటే వాళ్లకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు.

  టార్గెట్ కర్ణాటక, కేరళ.. United Nations హెచ్చరిక || Oneindia Telugu
   వీఐపీల లెక్క తేలుతుందా ?

  వీఐపీల లెక్క తేలుతుందా ?

  కిలాడీ లేడీ స్వప్న సురేష్ వెనుక చాలామంది వీఐపీలు ఉన్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదట గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు స్వప్న సురేష్ కు సంబంధం లేదని ఎన్ఐఏ అధికారులు అనుకున్నారు. అయితే విచారణలో స్వప్న సురేష్ కు సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకురావడంతో అదే ఎన్ఐఏ అధికారులు బిత్తరపోయారు. ఇప్పటికే తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ప్రముఖ వీఐపీ, జ్యూవెలర్స్ సంస్థ యజమాని హస్తం ఉందని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వప్న సురేష్ ఆమె కిలాడీ గ్యాంగ్ 20 సార్లుకు పైగా 200 కేజీలకు పైగా బంగారం స్మగ్లింగ్ చేశారని ఎన్ఐఏ అధికారులు ఆధారాలు సేకరించారని తెలిసింది. స్వప్న సురేష్ ఆమె అనుచరులను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

  English summary
  Kerala Gold smuggling: Strongly opposing the bail plea of Kerala gold smuggling accused Swapna Suresh, the NIA on Tuesday alleged in a special court here that she along with four co-accused had illegally brought in gold worth over Rs 100 crore through diplomatic channel.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X