కంగనా ఇష్యూలో భారీ ట్విస్ట్: ఆ బిల్డింగ్ శరద్ పవార్దేనన్న నటి - ఎన్సీపీ చీఫ్ ఖండన - పరిహారం?
మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు పడగొట్టిన సదరు బిల్డింగ్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు చెందినదేనని, కూల్చివేత నోటీసులకు జవాబుదారి కూడా ఆయనే అని కంగనా బంబు పేల్చారు. ఇప్పటికే కంగనా వ్యవహారంలో శివసేన-ఎన్సీపీ మధ్య విభేదాల పొడచూస్తోన్న వేళ నటి చేసిన తాజా వ్యాఖ్యలు మరింత అగ్గిరాజేసేలా ఉన్నాయి. దీనిపై పవార్ సైతం వెంటనే స్పందించారు.
ఆ చట్టాలతో ముస్లింలకే ఎక్కువ నష్టం - ఆలయ భూముల్ని కాపాడండి - కొత్త రెవెన్యూ చట్టానికి ఎంఐఎం మద్దతు

కంగన క్లెయిమ్ ఇది..
ముంబై సిటీలోని పలి హిల్స్ ప్రాంతంలో ఉన్న కంగనా రనౌత్ కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ బీఎంసీ గతవారం కూల్చేయడం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య ఉదంతం తర్వాత నుంచి ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన నటి.. ముంబై సిటీని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పోల్చడం వివాదాస్పదమైంది. ప్రతీకారచర్యగానే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తన కార్యాలయాన్ని కూల్చేసిందని, దీనిపై పోరాటం కొనసాగిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. కాగా, గురువారం నాటి ఓ ప్రకటనలో కంగన కొత్త విషయాలను క్లెయిమ్ చేశారు. ‘‘బీఎంసీ పంపిన నోటీసు నా ఫ్లాట్ ఒక్కదానికే కాదు.. మొత్తం బిల్డింగ్ కు ఇష్యూ చేశారు. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరో కాదు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఆయనకు భాగస్వామి నుంచి ఈ ఫ్లాట్ ను నేను కొన్నాను. బిల్డింగ్ యజమానిగా నోటీసులకు జవాబుదారీ పవారే'' అని పేర్కొన్నారు.
చైనాతో టెన్షన్: ఢిల్లీలో హీట్ - త్రివిధ దళాలతో రాజ్నాథ్ రివ్యూ - అజిత్ దోవల్ ‘స్పెషల్' ఎంట్రీ

శరద్ పవార్ వివరణ..
బీఎంసీ కూలగొట్టిన ఫ్లాట్ మాత్రమే తనదని, అదున్న బిల్డింగ్ మాత్రం శరద్ పవార్ దేనంటూ కంగనా చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ చీఫ్ ఖండించారు. పలి హిల్స్ లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇటీవల కూలగొట్టిన బిల్డింగ్ తో తనకెలాంటి సంబంధం లేదని, కంగనా రనౌత్ చేస్తోన్న క్లెయిమ్ పూర్తిగా అబద్ధమని శరద్ పవార్ వివరణ ఇచ్చారు. ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనాపై శివసేన శ్రేణులు ఇప్పటికీ ఆందోళనలు కొనసాగిస్తుండగా, తాజాగా పవార్ పై కామెంట్లను నిరసిస్తూ ఎన్సీపీ కార్యకర్తలు సైతం నటిపై మండిపడుతున్నారు.

కూటమిలో కంగనా చిచ్చు..
నటి కంగనా రనౌత్ వ్యవహారం మహారాష్ట్ర అధికార కూటమిలో విభేదాలకు కారణమైంది. కంగన కామెంట్లకు అనవసరంగా ప్రాధాన్యం ఇచ్చి వివాదాన్ని పెద్దది చేశారని, రాజకీయ చతురతతో కాకుండా ఆవేశపూరితంగా వ్యవహరించారని సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఇద్దరు నేతల భేటీలో పవార్ తన అసహనాన్ని వ్యక్తం చేయగా.. సీఎం ఠాక్రే మాత్రం ఈ విషయంలో తన తప్పేమీ లేదని, బీజేపీ ఒక పద్ధతి ప్రకారం శివసేనపై, మహా ప్రభుత్వంపై దాడి చేయిస్తున్నదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇదలా ఉంటే,

కంగనాకు నష్టపరిహారం..
నటి కంగన బిల్డింగ్ కూల్చివేత ఇష్యూలో కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే మరో సంచలనానికి తెరలేపారు. గురువారం ముంబైలోని కంగనా ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆయన.. శుక్రవారం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ముందు కీలక ప్రతిపాదన చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీలు కంగను అన్యాయం చేశాయని, వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని, అవసరమైతే నష్టపరిహారం కూడా చెల్లించేలా ఆదేశించాలని కేంద్ర మంత్రి అథావాలే కోరారు.