వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ఇలా...: ప్రధాని మోడీ 'ఐడియా'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా జనవరి 26న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ఒబామాను పిలవాలన్న ఐడియా ప్రధాని మోడీకి వచ్చింది. ఈ ఆలోచన వచ్చిన వెంటనే మోడీ.. అమెరికాలోని ఇండియన్ అంబాసిడర్‌కు విషయాన్ని చెప్పారని తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించాలన్న ఆలోచన ప్రధాని మోడీకి వచ్చిందని చెప్పారని అంటున్నారు. ఈ విషయం చెప్పి శ్వేత సౌధం సమాధానం ఏమిటో చెప్పాలని సూచించారు. అనంతరం అమెరికాలోని భారత రాయబారి పలుమార్లు అధికారులతో భేటీ అయ్యారు.

Obama invite idea came from PM Narendra Modi

వారు గణతంత్ర వేడుకల ప్రాధాన్యతను వివరించారట. దీంతో, అమెరికా ప్రతినిధులు మోడీ పొలిటికల్ గెశ్చర్‌ను ప్రశంసించారట. కొద్ది టైంలోనే వారు ఆమోదాన్ని తెలిపారు. అనంతరం భారత రాయబారికి ఒకే చెప్పారు. అనంతరం ప్రధాని మోడీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పారు.

బరాక్ ఒబామాను గణతంత్ర వేడుకలకు అతిథిగా తీసుకు వస్తున్నట్లు అతను ట్వీట్ చేశారు. ఈ తతంగమంతా ఇరువైపుల కూడా చాలా క్లోజ్ అఫీషియల్స్ ద్వారా జరిగిందంటున్నారు. దీని గురించి చాలా కొద్ది మందికే తెలుసంట. నరేంద్ర మోడీ, ఒబామాలు సెప్టెంబర్ 30వ తేదీన భేటీ అయిన తర్వాత కొద్ది రోజులకే ఈ తతంగం జరిగిందని తెలుస్తోంది.

English summary
Known for his out-of-the-box thinking on foreign policy issues, it was Prime Minister Narendra Modi who came up with the idea of inviting US President Barack Obama as the Chief Guest for the Republic Day Parade on January 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X