వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీన్ని చూశాక ఎవరైనా గెలుపుపై ఆశలు పెట్టుకోగలరా?: మోడీ ప్రశ్న, ములాయం-అఖిలేష్‌లపై..

|
Google Oneindia TeluguNews

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు (సోమవారం) ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో పరివర్తన్ ర్యాలీలో పాల్గొని, ప్రసంగించనున్నారు. ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీలో ముసలం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

పరివర్తన్ ర్యాలీలో ప్రధాని ఇలా..

- నా జీవితంలో ఇంత పెద్ద సభ చూడలేదు. ఇలంటి సభలో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నా. లక్నో జన సంద్రాన్ని చూశాక ఏ పార్టీ అయినా విజయం పైన ఆశలు పెట్టుకోగలదా?

- 14 ఏళ్లుగా యూపీలో అభివృద్ధి లేదు. మొత్తం కుంటుపడింది. బీజేపీ గెలిస్తే వాటికి చెక్ చెబుతుంది.

- బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు కష్టాలు పడకుండా చేస్తుందన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ యూపీని కాపాడేందుకు ఉందన్నారు.

- యూపీని రక్షించే ఒకే ఒక పార్టీ బీజేపీ అన్నారు. యూపీ భవిష్యత్తు బీజేపీతోనే మారుతుందన్నారు.

- దేశం అభివృద్ధి కావాలంటే ముందు ఉత్తర ప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలన్నారు. దేశ ప్రజలే దేశ ప్రధానికి హైకమాండ్ అన్నారు.

- కుటంబం కోసం పాకులాడే పార్టీలు రాష్ట్రాన్ని కాపాడుతాయా అని సమాజ్ వాది పార్టీలోను ముసలాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

- సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ బీజేపీ నినాదం అన్నారు.

- రాజకీయాలు పార్టీల వరకే పరిమితం కావాలి తప్ప ప్రజలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. యూపీలో పాలకులకు అభివృద్ధి ప్రాధాన్య అంశం కాలేదని ఆరోపించారు.

- దేశంలో అవినీతి, నల్లధనంపై పోరాటం ఎప్పుడూ ఆగదన్నారు. రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ ఎప్పుడైనా కలిశాయా? అని ప్రశ్నించారు. ఇన్నేళ్ల తర్వాత తనకు వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీ ఒక్కటయ్యాయన్నారు. నల్లధనం అవినీతి నిర్మూలనకు తాను పనిచేస్తున్నట్టు చెప్పారు.

- తమది పేదల కోసం పనిచేసే ప్రభుత్వమని, ఉత్తర్ ప్రదేశ్‌ అభివృద్ధి కోసం తమ పార్టీకి ఓటు వేయాలన్నారు.

- 2014లో తాను నిర్వహించిన ప్రచారం సందర్భంగా కూడా ఇంతమంది రాలేదన్నారు. ఉదయం నుంచే భారీగా జనం వస్తున్నారని ఫొటోలు చూపిస్తే, తానే ఆలస్యంగా వస్తున్నానేమోనని అనుమానం వచ్చిందన్నారు. ఇంతమంది ప్రజలను చూశాక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పటం కష్టంకాదన్నారు. ఇక బీజేపీ పద్నాలుగేళ్ల నిరీక్షణ ముగిసినట్లేనన్నారు.

English summary
PM Modi LIVE : Parivartan Rally in Lucknow, Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X