వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాంక్యూ ఒబామా: మోడీ ఆత్మీయ అలింగనం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాణిజ్యం, భద్రత, పెట్టుబడుల రంగాల్లో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకొని అంతర్జాతీయ సమస్యలపై కలిసి ముంద డుగు వేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు నిర్ణయించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాలని అంగీకరించాయి.

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం సుదీర్ఘ కాలంగా భారత్ చేస్తున్న యత్నాలకు అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు మద్దతు పలికింది. భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్ లు కూడా భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికాయి.

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతుగా నిలిచిన అమెరికాకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (అపెక్)లో అమెరికాతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎగుమతి సంస్థల్లో భారత్ భాగస్వామ్యానికి మద్దతిచ్చినందుకు ఒబామాను మోడీ అభినందించారు.

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

ఏడాది కాలంలో వీరిద్దరి మధ్య భేటీ జరగడం ఇది మూడోసారి. ఇరుదేశాల మధ్య ఆర్థికపరమైన మైత్రి బంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాతావరణ మార్పులను నిరోధించేందుకు తీసుకోవల్సిన చర్యలు గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక భేటీకి ముందు ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని ఒబామా ఆయనకు ఆహ్వానం పలికారు.

 భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

దాదాపు గంట సేపు చర్చలు సాగిన ఈ భేటీ తర్వాత ఒబామా మీడియాతో మాట్లాడుతూ ‘‘మా వ్యూహాత్మక దూరదృష్టికి మరింతగా పదునుపెట్టటం ఎలా అనే అంశంపై మేం చర్చించాం. భధ్రత, ఆర్థికవ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడులు అంశాలతో పాటు.. రక్షణ కొనుగోళ్ల ముందుకు సాగటం ఎలా అనేదీ చర్చించాం. వీటన్నిటిలో ప్రధాని విశిష్టమైన భాగస్వామిగా ఉన్నారు'' అని తెలిపారు.

 భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

అమెరికా అధ్యక్షుడి స్నేహాన్ని, భారత్‌తో సంబంధానికి ఆయన నిబద్ధతను తాను చాలా గౌరవస్తున్నానని మోడీ పేర్కొన్నారు. ‘‘ద్వైపాక్షిక సంబంధాల్లో.. ఉగ్రవాదంపై పోరు, సైబర్ భద్రత, శిక్షణ వంటి విస్తృత వ్యూహాత్మక, భద్రతాంశాలు ఉన్నాయి. రక్షణ వాణిజ్యం, శిక్షణ సహా మా రక్షణ సహకారం విస్తరిస్తోంది. తీవ్రవాదంపై పోరాటంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం'' అని వివరించారు.

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

మోడీ పర్యటన సందర్భంగా అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి దాదాపు రూ.18,000 వేలకోట్లకుపైగా వ్యయంతో 22 ఆపాచే, 15 చినూక్ హెలికాప్టన్ల కొనుగోలుకు భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం విలువ మూడు బిలియన్ అమెరికన్ డాలర్లు.

 భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

ఉగ్రవాదానికి నిర్వచనం ఇవ్వటంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని ప్రధాని మోడీ విమర్శించారు. ఐరాస పుట్టి 70 ఏండ్లయినా ఉగ్రవాదానికి ఇప్పటికీ సరైన నిర్వచనం ఇవ్వలేకపోయింది. మరి దానిని ఎదుర్కోవటానికి ఎంతకాలం పడుతుంది? ఉగ్రవాది అంటే ఎవరో ఐరాస స్పష్టంగా ప్రకటించాలి. అప్పుడే శాంతి స్థాపనకు అంతర్జాతీయ సమాజం ప్రణాళికను సిద్ధం చేయగలదన్నారు.

 భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

ఈ ఏడాది జనవరిలో ఒబామా భారత్‌లో పర్యటించారు. అంతుకు ముందు ఎన్నడూ లేని విధంగా భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంలో మోదీ, ఒబామాల మధ్య అనేక అంశాలపై విస్తృత చర్చలుజరిగాయి. ఆరురోజుల పర్యటనార్థాం ఇక్కడకు వచ్చిన నరేంద్ర మోడీ సిలికాన్ వ్యాలీని సందర్శించారు.

 భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

ప్రసావ భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రముఖుల గౌరవార్థం దేశాధినేతలకు ఇచ్చే సంప్రదాయ మధ్యాహ్న విందులో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్‌తో పాటు మోడీ, ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్‌లు ఉన్నత వేదిక (హై టేబుల్)పై ఆసీనులయ్యారు. ఒబామాతో మోడీ భేటీ ముగిసిన వెంటనే ఈ విందు జరిగింది.

 భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

ముఖ్యంగా ఇరుదేశాలు వాణిజ్య, వ్యూహాత్మక చర్చల ప్రక్రియను ప్రారంభించిన దృష్ట్యా ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ తాజా సమావేశంలో ఇరుదేశాలు ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి మరింత సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. అలాగే ముంబై దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలని పాక్‌కు గట్టిగా స్పష్టం చేశాయి.

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలోపేతం

ఒబామాతో భేటీకి ముందు మోడీ సోమవారం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడ హోలాండ్‌లతో వేరువేరుగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. మండలిలో శాశ్వతసభ్యత్వం కోసం భారత అభ్యర్థిత్వానికి బ్రిటన్, ఫ్రాన్స్‌లు రెండూ మద్దతు తెలిపాయి. మోడీ-హోలాండ్‌ల సమావేశం సాగుతుండగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అనుకోని అతిథిగా హాజరయ్యారు.

English summary
Before flying back to India after his 5-day visit to US, Prime Minister Narendra Modi made another pitch for reforms in the United Nations Security Council, during the world body's peacekeeping summit today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X