• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది, అత్త కూతురు కిడ్నాప్, కారులో కల్యాణం, రివర్స్, జైల్లో బావ, అయ్యో పాపం !

|

బెంగళూరు: నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్ను కాదని వేరే అమ్మాయితో జీవితం పంచుకోలేనని ఓ బావ మరదలికి చెప్పాడు. నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను, ఛీ పో అంటూ మరదలు తేల్చి చెప్పింది. రగిలిపోయిన బావ మరదలిని కిడ్నాప్ చేసి కారులో బలవంతంగా కల్యాణం చేసుకున్నాడు. అయితే కథ అడ్డం తిరగడంతో సదరు బావ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. చూసిన వాళ్లు, తెలిసిన వాళ్లు బావను చూసి అయ్యో పాపం అంటున్నారు.

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

సొంత అత్త కూతురు

సొంత అత్త కూతురు

కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసికెరె తాలుకా కుడుకుంది గ్రామంలో మను అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. హాసన్ సమీపంలోని దుద్ద పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 22 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. మనుకు స్వయానా అత్త కుమార్తె ఆ యువతి. అత్త కూతురిని వివాహం చేసుకోవాలని మను అనుకున్నాడు.

ఛీ కొట్టిన అత్త కూతురు

ఛీ కొట్టిన అత్త కూతురు

నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్నేపెళ్లి చేసుకుంటానని మను అత్త కూతురికి చెప్పాడు. అయితే నిన్ను నేను ప్రేమించనని, పెళ్లి చేసుకోనని అత్త కూతురు తేల్చి చెప్పింది. ఎలాగైనా అత్త కూతురినే పెళ్లి చేసుకోవాలని మను నిర్ణయించాడు. అయితే ఇటీవల జరిగిన ఓ శుభకార్యంలో కలుసుకున్న సమయంలో అత్త కూతురు మనును ఛీకొట్టింది.

పక్కాప్లాన్ తో అత్త కూతురు కిడ్నాప్

పక్కాప్లాన్ తో అత్త కూతురు కిడ్నాప్

ఎలాగైనా అత్త కూతురికి బుద్ది చెప్పాలని మను నిర్ణయించాడు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన యువతి టైలరింగ్ క్లాస్ కు వెళ్లడానికి గ్రామంలోని బస్ స్టాప్ దగ్గర వేచి ఉంది. అదే సమయంలో స్నేహితులతో కలిసి కారులో బస్ స్టాప్ దగ్గరకు వెళ్లిన మను అత్త కూతురిని కారులో కిడ్నాప్ చేశాడు.

కారులో కల్యాణం

కారులో కల్యాణం

అత్త కూతురిని కిడ్నాప్ చేసిన మను స్నేహితుల సహాయంతో వేగంగా వెలుతున్న కారులోనే ఆమె మెడలో బలవంతంగా తాళి కట్టాడు. మను అత్త కూతురి మెడలో తాళి కడుతున్న సమయంలో అతని స్నేహితులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గ్రామంలో కూతురు కిడ్నాప్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక చెక్ పోస్టుల్లో వాహనాలు పరిశీలించారు. రామనగర జిల్లాలోని ఓ ప్రాంతంలో మను, అతని స్నేహితులు వెలుతున్న కారును గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

బావ మీద కేసు పెట్టిన మరదలు

బావ మీద కేసు పెట్టిన మరదలు

నవ దంపతులను హాసన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో హాజరుపరిచారు. తనను బలవంతంగా బావ పెళ్లి చేసుకున్నాడని యువతి కేసు పెట్టడంతో పోలీసులు మనును అరెస్టు చేసి జైలుకు పంపించారు. మనుకు సహాయం చేసి యువతిని కిడ్నాప్ చేసిన స్నేహితుల మీద కేసు నమోదైయ్యిందని పోలీసులు తెలిపారు. అత్త కూతురిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి జైలుకు వెళ్లిన మనును చూసి అతని స్నేహితులు, బంధువులు అయ్యో పాపం అంటున్నారు.

English summary
Police arrested Manu who kidnapped and forcefully married girl who waiting for the bus near Hassan in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more