వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరుడా వందనం : అమర జవాన్లకు రాష్ట్రపతి నివాళి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సరిహద్దులో గస్తీ కాస్తూ, విధి నిర్వహణలో ఆసువులు బాసిన అమర జవాన్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం పాటుపడుతోన్న జవాన్ల సేవలను కీర్తించారు. మంగళవారం సీఆర్పీఎఫ్ వేలర్ డే (శౌర్య దినోత్సవం) సందర్భంగా ఢిల్లీలోని చాణక్యపురిలో గల నేషనల్ పోలీసు మెమోరియల్ వద్ద అమర జవాన్ల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళలు అర్పించారు. ఆ తర్వాత సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

president ramnath tribute crpf jawans

ఇదీ నేపథ్యం ..
1965లో గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కుచ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు పాకిస్థాన్‌పై చేసిన పోరాటానికి గుర్తుగా ప్రతి ఏడాది ఏప్రిల్ 9న సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. గతేడాది పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవం రోజున ప్రధాని మోదీ చాణక్యపురిలో పోలీసుల స్మారక ప్రదర్శనశాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్‌ గౌబా, ఇంటిలెజెన్స్‌ బ్యూరో డైరెక్టర్ రాజీవ్‌ జైన్, సీఆర్పీఎఫ్ డైరెక్టర్‌ రాజీవ్‌ రాయ్‌ భట్నగర్‌తో పాటు మిగతా పారామిలటరీ అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

English summary
president Ramnath Kovind paid tribute to the amulets who were in charge of the task of patrolling the border. He praised the jawans' service for the defense of the country. At the National Police Memorial in Chanakyapuri, Delhi, on the occasion of the CRPF Velar Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X