వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెర‌పైకి ప్రియాంక గాంధీ పేరు?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష స్థానానికి రాహుల్‌గాంధీ ఆస‌క్తిగా లేక‌పోతే బ‌ల‌వంతం చేయ‌లేమ‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత ద్విగ్విజ‌య్‌సింగ్ అన్నారు. త‌మ‌ వ‌ర‌కు ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని, అయితే నిర్ణ‌యం రాహుల్‌పైనే ఆధార‌ప‌డివుంటుంద‌ని, ఎవ‌రినీ బ‌ల‌వంతం చేయ‌లేం క‌దా అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకోవ‌డానికి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అయితే 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మిపాల‌వ‌డంతో ప‌ద‌వికి రాజీనామా చేసిన రాహుల్ ప్ర‌స్తుతం ఆ ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి ఆస‌క్తిగా లేరంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

Priyankas name will be considered if Rahul doesnt agree

రాహుల్ దృష్టంతా త్వ‌ర‌లో జ‌ర‌బోయే భార‌త్ జోడో యాత్ర‌పైనే ఉంద‌ని, అధ్య‌క్ష ప‌ద‌వికి ప్రియాంక గాంధీ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌యోభారంతో సోనియాగాంధీ ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి తిర‌స్క‌రించారు. సెప్టెంబ‌రు 20వ తేదీలోగా కంగ్రెస్ సార‌థి ఎన్నిక పూర్తి కావాలి. గాంధీ కుటుంబానికి చెందిన వ్య‌క్తే ఆ ప‌ద‌వి చేప‌డితే బాగుంటుంద‌ని సీనియ‌ర్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాహుల్ ఒప్పుకోక‌పోతే ప్రియాంక పేరును ప‌రిశీలిస్తార‌ని, అయితే యూపీ ఎన్నిక‌ల్లో వైఫ‌ల్యం ఆమెను వెంటాడుతోంద‌ని, సోనియా, రాహుల్‌, ప్రియాంక ముగ్గురూ కాక‌పోతే ఎవ‌రిని ఎన్నుకోవాలి? పార్టీ ప‌రిస్థితి ఏమిటి? అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లున్నారు.

English summary
Priyanka's name will be considered if Rahul doesn't agree, but failure in UP elections is haunting her, if not Sonia, Rahul and Priyanka, who should be chosen?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X