జర్నలిస్ట్‌గా రజనీకాంత్, ఆసక్తికర విషయం: సంస్థ ఏమన్నదంటే

చెన్నై/బెంగళూరు: సినిమాల్లోకి రాకముందు తాను బెంగళూరులో కొంతకాలం కన్నడ జర్నలిస్ట్‌గా పని చేశానని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. అభిమానులకు, జనాలకు ఆయన బస్సు కండక్టర్‌గా పని చేసినట్లు మాత్రమే తెలుసు. కానీ జర్నలిస్టుగా పని చేశానని ఆయన తాజాగా వెల్లడించడం చర్చనీయాంశమైంది.

ఆయన గురించి తెలియని మరో విషయం ఇది అంటూ చెప్పుకుంటున్నారు. చెన్నైలో రజనీకాంత్ మంగళవారం మాట్లాడుతూ.. తాను జర్నలిస్టుగా పని చేశానని, కన్నడ జర్నలిస్టుగా పని చేశానని, సంయుక్త కర్నాటక న్యూస్ పేపర్‌లో ప్రూఫ్ రీడర్‌గా చేశానని చెప్పారు.

Recommended Video

    కరుణానిధిని కలవనున్న రజనీకాంత్..
    Rajinikanth says He was Kannada Journalist before taking up acting

    రజనీకాంత్ పని చేయలేదు

    రజనీకాంత్ తమ సంస్థలో పని చేయలేదని సంయుక్త కర్నాటక దిన పత్రిక యాజమాన్య సంస్థ లోక శిక్షణ ట్రస్ట్ తెలిపింది. రజనీ తన సన్నిహిత మిత్రుడు రామచంద్ర రావు తమ న్యూస్ పేపర్లో ప్రూఫ్ రీడర్‌గా పని చేసేవారని, ఆయనను కలిసేందుకు రజనీ వచ్చారని, పనిలో తన స్నేహితుడికి సహాయం చేసేవారని స్పష్టం చేసింది.

    ఇదంతా అనధికారికంగా జరిగేదని, దీనికి ఎటువంటి వేతనం చెల్లించలేదని, జర్నలిజం పట్ల ఆసక్తి ఉండటం వల్లే రజనీకాంత్ తన మిత్రుడికి పనిలో సాయం చేసేవారని లోక శిక్షణ ట్రస్ట్ చైర్మన్ ఉమేష్ వెల్లడించారు. తమ సంస్థతో రజనీకాంత్ అనుబంధం కలిగి ఉండటం గౌరవంగా భావిస్తున్నామని, త్వరలోనే ఆయనను తమ కార్యాలయానికి ఆహ్వానిస్తామని చెప్పారు. కాగా, ఇక్కడ రజనీకాంత్ ఉద్దేశ్యం జర్నలిస్టుగా కూడా అధికారికంగానో, అనధికారికంగానో పని చేశానని చెప్పడమే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+