వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shiv Sena: రెబల్ ఎమ్మెల్యేలను కసబ్ తో పోల్చిన సంజయ్ రౌత్, కసబ్ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చారు!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/గోవా: మహారాష్ట్రలో కొలుకు తీరిన ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ సంకీర్ణ ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, శివసేన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. శివసేన మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ కు కూడా ఇంత భారీగా సెక్యూరిటీ ఇవ్వలేదని, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు గోవా నుంచి ముంబాయి చేరుకునే వరకు.

హోటల్ నుంచి విధాన భవన్ చేరుకునే వరకు అంత సెక్యూరిటీ ఇచ్చారని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలపై శివసైన రెబల్ ఎమ్మైలేలు ఎమాత్రం పట్టించుకోవడం లేదు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సంతోషంగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు చాలా బిజీగా ఉండటంతో సంజయ్ రౌత్ మాటలు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలోలేరని వెలుగు చూసింది.

Family: మహారాష్ట్రలో చరిత్ర సృష్టించిన మామా అల్లుడు, రామ్ రాజ్ అక్కడ, రాహుల్ ఇక్కడ బాస్, పార్టీలు!Family: మహారాష్ట్రలో చరిత్ర సృష్టించిన మామా అల్లుడు, రామ్ రాజ్ అక్కడ, రాహుల్ ఇక్కడ బాస్, పార్టీలు!

గుహవాటి టూ గోవా

గుహవాటి టూ గోవా

శివసేన మీద తిరుగుగబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు కొంతకాలం క్రితం ముంబాయి నుంచి నేరుగా గుజరాత్ లోని సూరత్ వెళ్లి రెండు మూడు రోజు ఉన్నారు. సూరత్ నుంచి గుహవాటి వెళ్లిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అక్కడ వారం రోజులకు పైగా ఉన్నారు. గుహవాటి నుంచి గోవా వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలు అక్కడ కొంతకాలం ఉన్నారు.

ఏక్ నాథ్ సీఎం..... ముంబాయిలో వాలిపోయారు

ఏక్ నాథ్ సీఎం..... ముంబాయిలో వాలిపోయారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన తరువాత గోవా నుంచి ముంబాయిలో అడుగుపెడుతామని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారు. సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. శివసేన రెబల్ లీడర్ సీఎం కావడంతో రెబల్ ఎమ్మేలు గోవాలో డ్యాన్స్ లు చేసి సంబరాలు చేసుకున్నారు. తరువాత శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయి చేరుకున్నారు.

స్టార్ హోటల్ లో భారీ బందోబస్తు

స్టార్ హోటల్ లో భారీ బందోబస్తు

గోవా నుంచి ముంబాయి చేరుకున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు దక్షిణ ముంబాయిలోని ఓ స్టార్ హోటల్ లో బస చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగే ఫ్లోర్ టెస్ట్ కు హోటల్ నుంచి నేరుగా వెళ్లాలనని రెబల్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. దక్షిణ ముంబాయిలోని స్టార్ హోటల్ దగ్గర, హోటల్ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ (విధాన్ భవన్)కు చేరుకునే వరకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉగ్రవాది కసబ్ కంటే ఎక్కువ భద్రత రెబల్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు

ఉగ్రవాది కసబ్ కంటే ఎక్కువ భద్రత రెబల్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు

శివసేన మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ కు కూడా ఇంత భారీగా సెక్యూరిటీ ఇవ్వలేదని, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు గోవా నుంచి ముంబాయి చేరుకునే వరకు. హోటల్ నుంచి విధాన భవన్ చేరుకునే వరకు అంత సెక్యూరిటీ ఇచ్చారని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

రెబల్స్ పట్టించుకునే పరిస్థితిలో లేరు

రెబల్స్ పట్టించుకునే పరిస్థితిలో లేరు

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలపై శివసైన రెబల్ ఎమ్మైలేలు ఎమాత్రం పట్టించుకోవడం లేదు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సంతోషంగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు చాలా బిజీగా ఉండటంతో సంజయ్ రౌత్ మాటలు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలోలేరని వెలుగు చూసింది.

ఎమ్మెల్యేలు కాదు, ప్రజలు ముఖ్యం.... మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే

ఎమ్మెల్యేలు కాదు, ప్రజలు ముఖ్యం.... మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే

శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ బందోబస్తు కల్పించారని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ఆరోపించారు. ఎమ్మెల్యేలు జారీపోయినా పర్వాలేదు, మేము ప్రజల ముందుకు వెలుతాము, మళ్లీ శివసైనికులు, నాయకులను తీర్చదిద్దుకుంటామని, మాకు ప్రజలే నాయకులు అని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
Shiv Sena leader Sanjay Raut on Monday took at jibe at Eknath Shinde-led rebel MLAs saying that even Kasab didn’t have so much security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X