వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారా హుషార్: అదో హిప్నాటిక్ గేమ్.. ఇదో బ్లూవేల్ సవాల్

అదో సోషల్ మీడియా గేమ్. ఇంకా చెప్పాలంటే హిప్నాటిక్ గేమ్. డౌన్‌లోడ్ చేసుకొని ఆడడం ప్రారంభిస్తే దాని ఫైనల్ టాస్క్ మనకు ముగింపు పలికేస్తుంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అదో సోషల్ మీడియా గేమ్. ఇంకా చెప్పాలంటే హిప్నాటిక్ గేమ్. డౌన్‌లోడ్ చేసుకొని ఆడడం ప్రారంభిస్తే దాని ఫైనల్ టాస్క్ మనకు ముగింపు పలికేస్తుంది. మొదట చిన్న చిన్న సవాళ్లను విసిరే ఈ క్రీడ చివరకు మనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది.

ఆ ఆట పేరు బ్లూవేల్ ఛాలెంజ్. చూడటానికి జస్ట్.. ఒక మొబైల్ గేమ్ అనిపిస్తుంది కానీ, 10 నుంచి 14 ఏండ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట వేటాడేస్తుంది. భావోద్వేగాలతో పసి హృదయాలను మృత్యుముఖంలోకి తోసేస్తుంది.
రష్యాలో ఇప్పటికే 130మందికి పైగా టీనేజర్లను పొట్టన బెట్టుకున్న గేమ్.. భారత దేశంలో తొలిసారి ఓ ముంబై పిల్లాడిని చంపేసింది. ఈ ప్రాణాంతక క్రీడను రూపొందించిన సైకో డెవలపర్ ఫిలిప్ బుడేకిన్‌ను రష్యా పోలీసులు అరెస్టుచేసినా, ఆ ఆట అంతర్జాలంలో అలా వివిధ దేశాలకు విస్తరిస్తున్నది.

హర్రర్ సినిమా చూడమని ఇలా ప్రేరేపణ

హర్రర్ సినిమా చూడమని ఇలా ప్రేరేపణ

బ్లూవేల్.. ఓ సైకో గేమ్. 50 రోజుల పాటు ప్రతిరోజూ రోజుకో టాస్క్‌తో టీనేజర్ల భావోద్వేగాలతో ఆడుకుంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడడం ప్రారంభించాక, తొలుత చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేసి, వాటి తాలూకు ఫొటోలను షేర్ చేయాలి. అలా ఒకటీ రెండు రోజులు అలవాటయ్యాక, గేమ్ స్థానంలో మెంటర్ అందుబాటులోకి వస్తాడు. అప్పటినుంచి మృత్యు క్రీడ ప్రారంభమవుతుంది. టాస్క్‌ల్లో భాగంగా.. భయం గొలిపే హర్రర్ సినిమాను తెల్లవారుజామున నాలుగు గంటలకు చూడమంటాడు.

అలా చూస్తూ దాని ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. అర్ధరాత్రి లేచి చీకటి గదిలో ఒంటరిగా కూర్చోవాలనో, లేక ఇంటినుంచి బయటకు వెళ్లాలనో మరో టాస్క్ ముందు పెడతాడు. చర్మంపై కత్తికానీ, ఇతర పదునైన వస్తువులతో కానీ బొమ్మలను, ఆకారాలను గీసి, దానికి సంబంధించిన ఆధారాలు కోరుతాడు. ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయమంటాడు. చేస్తూ పోతున్న కొద్దీ అడ్మినిస్ట్రేటర్ టాస్క్‌లు ఇస్తూ వెళ్తాడు. టాస్క్ పెరుగుతున్నాకొద్దీ వాటి తీవ్రత పెరుగుతుంది. సరదాగా నగ్న చిత్రాలను షేర్ చేయమంటాడు.

బాయ్‌ఫ్రెండ్‌తోగానీ గర్ల్‌ఫ్రెండ్‌తోగానీ డేటింగ్ చేయమని ప్రేరేపిస్తాడు. తప్పులపై తప్పులు చేయిస్తున్నా, టీనేజర్లు ఇదంతా ఆటలో భాగమేనని భ్రమల్లోనే ఉంటారు తప్ప, వెనుక ఉన్న మెంటర్ (అడ్మినిస్ట్రేటర్) దీన్ని చేయిస్తున్నాడని తెలుసుకోలేరు. ఇలా రోజుకో టాస్క్‌తో 50 రోజుల్లో కథ ముగుస్తుంది. చివరి రోజు చివరి టాస్క్‌గా భవనంపై నుంచి దూకమంటాడు. సెల్ప్ డెస్ట్రాయింగ్‌ను వీడియో తీయడం మర్చిపోవద్దనీ సూచిస్తాడు. ఈ టాస్క్‌తో గేమ్ విజయవంతంగా ముగుస్తుందని చెప్తాడు.

బ్లూవెల్ స్రుష్టికర్తకు మానసిక ఆస్పత్రిలో చికిత్స

బ్లూవెల్ స్రుష్టికర్తకు మానసిక ఆస్పత్రిలో చికిత్స

ఈ గేమ్ టీనేజర్లను పూర్తిగా హిప్నటైజ్ చేస్తుంది. ఏది నిజమో, ఏది కలో కూడా అర్థంకాని అయోమయ స్థితికి వారిని తీసుకెళ్తుంది. మానసిక ప్రోద్బలంలో తమను తాము చంపుకునే వరకూ వారిని ప్రేరేపిస్తుంది. ఇటీవల రష్యాలో 14 ఏండ్ల బాలికలు ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మరో బాలుడూ ఇలాగే ప్రాణం తీసుకున్నాడు. గేమ్ ఎండ్ అని రాసుకుని మరీ చనిపోయాడు. వీరి ఆత్మహత్యలపై దర్యాప్తు చేసిన పోలీసులు బ్లూవేల్ గేమ్ కారణమని తేల్చారు. ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 130మందికి పైగా రష్యన్ టీనేజర్లు ఈ గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ గేమ్‌ను రూపొందించిన 22 ఏండ్ల ఫిలిప్ బుడేకిన్‌ను అరెస్టు చేశారు. ఆయన ఓ సైకో అని తేలడంతో, మానసిక చికిత్సాకేంద్రంలో చేర్చారు.

బ్లూవేల్ ఛాలెంజ్ ఆన్‌లైన్ గేమ్ వెనుక ఏదైనా గ్రూప్ ఒకటి పనిచేస్తూ ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆటలో ఒకవేళ ఫైనల్ టాస్క్ చేయకపోతే ఏమవుతుంది? మిగతా 49 రోజులుగా పలు తప్పులు చేసి, అప్‌లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలు చూపించి టీనేజర్లను అడ్మినిస్ట్రేటర్ బెదిరిస్తాడని చెబుతారు. ఆ భయంతో ఎంతో కొంత పరిణతి కలిగిన పిల్లలు కూడా ఫైనల్ టాస్క్ పూర్తిచేసేందుకు సిద్ధం అవుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. మొదట రష్యాలో, తర్వాత దుబాయ్‌లో తన అరాచకాన్ని కొనసాగించిన ఆట తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చిలీ దేశాల్లోకి ప్రవేశించింది. అయితే, ముంబైలో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య తర్వాత అది భారత్‌లోకీ ప్రవేశించిందని గుర్తించారు.

మీ పిల్లల్ని కాపాడుకునేందుకు సోషల్ నెట్ వర్క్ వైబ్ సైట్ల సాయం

మీ పిల్లల్ని కాపాడుకునేందుకు సోషల్ నెట్ వర్క్ వైబ్ సైట్ల సాయం

బ్లూవేల్ చాలెంజ్ లాంటి ప్రాణాంతక ఆటల బారీన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాలని పలు సంస్థలు పిలుపు ఇస్తాయి. అంతర్జాతీయంగా చైతన్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ గేమ్ జోలికి పిల్లల్ని వెళ్లకుండా చూడాలని తల్లిదండుల్ని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్లు కూడా తమ యూజర్లను ఈ గేమ్ బారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు హెల్ప్‌లైన్లనూ ఏర్పాటు చేశాయి. ఫేస్‌బుక్‌లో టీనేజ్ యూజర్ ఎవరైనా బ్లూవేల్ ఛాలెంజ్ అనే హ్యాష్‌టాగ్‌తో సెర్చ్‌చేస్తే, వెనువెంటనే మీరు ఓకే కదా? మీకేమైనా సాయం కావాలా? అనే ప్రశ్న స్క్రీన్‌మీద ప్రత్యక్షమవుతుంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అంతే. టంబ్లర్‌లో బ్లూవేల్ చాలెంజ్ అని టైప్ చేయగానే, ఓ నీలిరంగు పేజీ ప్రత్యక్షమై అంతా ఓకేనా? అని అడుగుతుంది.

ముంబై టీనేజర్ మ్రుతికి బ్లూవెల్‌తో లింక్ ఇలా

ముంబై టీనేజర్ మ్రుతికి బ్లూవెల్‌తో లింక్ ఇలా

ఇటీవల భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఓ 14ఏండ్ల అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడానికి ‘బ్లూవేల్ చాలెంజ్' కారణమని భావిస్తున్నారు. అంధేరీ ఈస్ట్‌లో ఉండే తొమ్మిదో తరగతి విద్యార్థి మన్‌ప్రీత్ సహాన్ బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. సోషల్ మీడియాలో ఈ గేమ్ గురించి తెలుసుకుని ఆడిన మన్‌ప్రీత్, ఎలాగైనా గేమ్ గెలవాలని భావించే ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకూ బ్లూవేల్ చాలెంజ్ గేమ్‌కు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తాను సోమవారం స్కూల్‌కు రావడం లేదని శుక్రవారమే తన స్నేహితులకు చెప్పిన సహాన్ అన్నంత పనీ చేశాడు. చివరి రోజు భవనంపై కూర్చుని 20 నిమిషాలపాటు వాట్సాప్ గ్రూప్‌లోమిత్రులకు మెసేజ్ కూడా పెట్టాడు. తాను బిల్డింగ్ పైనుంచి దూకబోతున్నానని ఆయన పెట్టిన మెసేజ్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. రెండురోజుల ముందే ఆయన గూగుల్ సెర్చ్ సైట్‌లో భవనం పైనుంచి దూకడం ఎలా? అని వెతికాడని పోలీసులు తెలిపారు. భారత్‌లో ఇలా సోషల్ నెట్‌వర్కింగ్ గేమ్‌లో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన మొదటి ఘటన ఇదే.

English summary
So what’s the deal with the shadowy Blue Whale “suicide challenge” that can apparently brainwash a young ‘gamer’ into killing themselves? It is said that this “game” can reach a young teenager on social media sites if they endorse certain hashtags and get involved in some groups. When the player signs up for the game, she or he is assigned an administrator who provides them with a daily task to complete for 50 days, of which they must send photographic proof of completion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X