VIRAL VIDEO:సింగ్ చేస్తూ టీచ్, మ్యాథ్స్ ఇలా కూడా చెబుతారా, వైరల్, పదేళ్ల కిందనే
టీచింగ్ అనేది కత్తి మీద సామే. అవును ముమ్మాటికీ అదీ కష్టమే. అంటే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అందుకు టీచర్స్ విభిన్న పద్దతులును అవలంభిస్తారు. ఇక్కడ ఓ మాస్టార్.. ఏకంగా పాట పాడుతూ టీచ్ చేస్తున్నారు. ఆ వీడియో తెగ ట్రోల్ అవుతుంది. దానిని మీరు కూడా చూడండి. ఈ వీడియో పాతదే.. కానీ మళ్లీ ఇప్పుడు ట్రోల్ అవుతుంది.

పాడుతూ టీచ్
మ్యాథ్స్‌లో ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగొనొమెట్రీ.. ఇతర సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. అమెరికాలో ఓ టీచర్ మాత్రం.. ఇలా విభిన్నంగా టీచ్ చేస్తున్నారు. ట్రిగొనొమెట్రీను పాట పాడుతూ చక్కగా బోధించారు. ఇలా నేర్పించడం వల్ల స్టూడెంట్స్ గుర్తుంచుకుంటారు. మరచిపోరని ఆయన చెబుతున్నారు.

సింగింగ్ చేస్తూ..
అతను సింగింగ్ చేస్తూనే టీచ్ చేశారు. బుక్స్ లేవు,మార్కర్ లేదు, ఇతర టీచింగ్ టూల్ ఏదీ లేదు. ఆ వీడియోలో అతని బోధించే విధానం చక్కగా ఉంది. ఆధునిక పద్దతుల్లో ట్రిగొనొమెట్రీ టీచ్ చేస్తున్నారు. అదీ విద్యార్థులకు చక్కగా అర్థమవుతుంది. పాడుతున్నట్టు బోధించడంతో నవ్వుతూ.. చక్కగా గుర్తుంచుకుంటున్నారు.
పదేళ్ల కిందటి వీడియో..
ఆ వీడియోను మ్యాథ్స్ ఆల్ సో కెన్ బీ ఫన్ అనే ట్యాగ్ చేసి మరీ రాశారు. ఆ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది. వీడియోను ఫేస్ బుక్‌లో 2012లో షేర్ చేశారు. ఇప్పుడు అదీ మళ్లీ వైరల్ అవుతుంది. పాత వీడియో.. అదీ కూడా పదేళ్లు అవుతున్నా.. ఆ వీడియో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వీడియో 8.8 లక్షల వ్యూస్.. 4 వేల రీ ట్వీట్లు వచ్చాయి. 23 వేల లైకులు వచ్చాయి. నెటిజన్లు తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఆ వీడియో చూస్తే తమ గురువు గుర్తుకు వస్తున్నాడని తెలిపారు. ఈ మేరకు తమ అభిప్రాయం రాశారు.












Click it and Unblock the Notifications