వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నంత పనిచేస్తున్నారు: ఎన్ఆర్‌పీని నిలిపేస్తూ మమతా సర్కారు ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాను అన్నట్లు చేసేందుకు సిద్ధమైంది, ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్నార్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ.. కోల్‌కతా సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అంతేగాక, తన ప్రాణం ఉండగా.. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చి చెప్పింది.

విభజించాలనుకునే దుష్టశక్తుల ఎత్తులు పారవు: నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీవిభజించాలనుకునే దుష్టశక్తుల ఎత్తులు పారవు: నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ

ఎన్ఆర్పీ నిలిపేయాలంటూ..

ఎన్ఆర్పీ నిలిపేయాలంటూ..

ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిర్వహిస్తున్న జాతీయ జనాభా రిజిస్టర్ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలంటూ సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపేయాలంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సచివాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అక్రమ వలసదారులను పంపేందుకు కేంద్రం..

అక్రమ వలసదారులను పంపేందుకు కేంద్రం..


రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. పాపులేషన్ రిజిస్టర్ అనేది అక్రమంగా దేశంలోకి చొరబడిన వలసదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రక్రియ. అక్రమంగా వలస వచ్చిన వారిని దేశం నుంచి తరిమేయడం కోసం కేంద్రం ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మమత సర్కారు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలంటూ పురపాలికలు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

పెద్ద ఎత్తున మమతా నిరసన ప్రదర్శన

పెద్ద ఎత్తున మమతా నిరసన ప్రదర్శన

కాగా, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా సోమవారం భారీ ర్యాలీ నిర్వహించిన మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. తన రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోనని కుండబద్దలు కొట్టారు. పౌరసత్వ సవరణ చట్టం గానీ, ఎన్ఆర్సీని గానీ అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జోరాశ్యాంకో వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమతా బెనర్జీ ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌర నమోదును గానీ అమలు చేయని రాష్ట్రాల ప్రభుత్వాలను బర్తరఫ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినా సరే.. తన కంఠం ఊపిరి ఉన్నంత వరకూ పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌర నమోదు కార్యక్రమాన్ని గానీ అమలు చేయబోనని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. కేంద్రానికి తలొంచ బోయే ప్రశ్నే లేదని అన్నారు.

English summary
Bengal Chief Minister Mamata Banerjee, who promised this afternoon that the new Citizenship law and the National Register of Citizens would be implementedin the state only over her "dead body", took strong action by the evening, officially stopping work on the National Population Register.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X