వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా షట్‌డౌన్‌ను తృటిలో తప్పించిన కాంగ్రెస్, బైడెన్ లక్ష కోట్ల డాలర్ల బిల్లు వాయిదా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బిల్లును చూపిస్తున్న అమెరికా సర్వప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి, రిప్రజెంటేటివ్ జిమ్ క్లైబర్న్

డిసెంబర్ ప్రారంభం వరకూ ప్రభుత్వానికి నిధులు అందేలా చేసే తాత్కాలిక ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలపడంతో అమెరికాలో మరో షట్‌డౌన్ తృటిలో తప్పినట్లయింది.

నిధుల కేటాయింపుల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే అమెరికన్ కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఆమోదించింది. లేదంటే అమెరికాలో ఫెడరల్ మ్యూజియంలు, జాతీయ పార్కులు, భద్రత కార్యక్రమాలను మూసేయాల్సిన పరిస్థితి తలెత్తేది.

ఈ నిధుల బిల్లులో హరికేన్ సహాయక కార్యక్రమాలకు, అఫ్గాన్‌ శరణార్థుల పునరావాసానికి కేటాయింపులు చేశారు.

అయితే, అధ్యక్షుడు బైడెన్ తలపెట్టిన లక్ష కోట్ల డాలర్ల మౌలిక సదుపాయాల బిల్లును సభ వాయిదా వేసింది.

షట్‌డౌన్ ముంచుకొస్తున్నగడువుకు కేవలం కొన్ని గంటల ముందే తాత్కాలిక బిల్లుపై సంతకం చేసిన బైడెన్, "ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ బిల్లు ఆమోదం, ఇరుపక్షాలు కలిసి పని చేయడం సాధ్యమని గుర్తు చేస్తుంది" అని అన్నారు.

షట్‌డౌన్

కొత్తగా ఆమోదించిన నిధులతో, శుక్రవారం ఫెడరల్ ఏజెన్సీలను మూసివేయవలసిన అవసరం రాలేదు. వేలాది ప్రభుత్వ ఉద్యోగులు అన్‌పెయిడ్‌ లీవ్‌ తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కారు.

కోవిడ్ -19 మహమ్మారి కొనసాగుతున్న కారణంగా, ఆరోగ్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉండేది. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (హెచ్‌హెచ్‌ఎస్) తయారు చేసిన ప్రణాళిక ప్రకారం, షట్‌డౌన్ సందర్భంలో 43శాతం మంది సిబ్బందిని ఇంటికి పంపించాల్సి వచ్చేది.

సెనేట్‌లో బుధవారం రాత్రి రిపబ్లికన్లు, డెమొక్రాట్‌లు తాత్కాలిక బడ్జెట్ తీర్మానంతో డిసెంబర్ 3వరకు ప్రభుత్వాన్ని నడపడానికి ఒక ఒప్పందానికి వచ్చారు.

ఈ బిల్లును సెనేట్‌ 65-35 ఓట్లతో ఆమోదించింది. 15 మంది రిపబ్లికన్లు దీనికి మద్దతుగా ఓటు వేశారు. ప్రతినిధుల సభలో 254 - 175 ఓట్లతో తీర్మానం నెగ్గింది.

ఇతర పాలసీ అడ్డంకులు, ముఖ్యంగా అధ్యక్షుడు బైడెన్‌ ఆర్థిక ఎజెండాపై సున్నితమై చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ బిల్లు ఆమోదం పొందింది. అధ్యక్షుడి 1 ట్రిలియన్‌ డాలర్ల మౌలిక సదుపాయాల నిధుల బిల్లుపై గురువారం జరిగిన ఓటింగ్‌తో ముందుకు వెళ్తానని తొలుత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి చెప్పారు. అయితే డెమొక్రాట్‌లలోనే అభ్యుదయవాదులు, మధ్యేవాదుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో శుక్రవారం వరకు వాయిదా పడింది.

ముందుగా సామాజిక కార్యక్రమాలకు నిధులు సమకూర్చాలని అభ్యుదయవాదులు డిమాండ్ చేశారు.

రోడ్లు, వంతెనలు, ఇంటర్నెట్, ఇతర దేశీయ ప్రాధాన్యతలకు మౌలిక సదుపాయాల నిధుల బిల్లు 550 బిలియన్‌ డాలర్లను అందిస్తుంది.

అమెరికా కాంగ్రెస్ మరో ముఖ్యమైన డెడ్‌లైన్‌ను కూడా ఎదుర్కొంటుంది. అమెరికా ప్రభుత్వం వారాల వ్యవధిలో దాని రుణ పరిమితిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

అమెరికా తన రుణ పరిమితిని అక్టోబర్ 18నాటికి చేరుకోనుందని ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్ ఇటీవల తెలిపారు.

ఈ జాతీయ రుణ డిఫాల్ట్‌ సంక్షోభం అమెరికాతోపాటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రుణ పరిమితిని పెంచడంతో అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న అవసరాలకు చెల్లించడానికి అనుమతిస్తుంది. డిఫాల్ట్ చేయడం అసంభవం అయినప్పటికీ, రుణపరిమితి పెంపు ఆర్థిక మాంద్యాన్ని ప్రేరేపిస్తుంది. ఫెడరల్ ప్రభుత్వం మీద ఆధారపడిన లక్షలాది అమెరికన్లకు సహాయం అందకపోవచ్చు.

డెమొక్రాట్ల మెజారిటీ ఉన్న సభ, ప్రభుత్వం నడపడానికి, రుణ పరిమితిని ఎత్తివేయడానికి అవసరమైన రెండింటి తీర్మానానికి గత వారం ఓటు వేసింది.

అయితే సెనెట్‌లోని రిపబ్లికన్లు బిల్లు ముందుకు రాకుండా అడ్డుకున్నారు. కొత్త వ్యయంలో ట్రిలియన్ల డాలర్ల ఖర్చును చేర్చడమే బైడెన్ పాలనా యంత్రాంగం ప్రణాళిక అని పేర్కొంటూ, అందుకే రుణ పరిమితిని పెంచకూడదని వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Congress narrowly avoids U.S. shutdown, Biden postpones billions of dollars bill
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X