వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీ-20 ఊతం, 5 ట్రిలియన్ డాలర్లు సమకూరుస్తామని భరోసా..

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థలపై కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో జీ-20 సదస్సు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవం పోసే డిసిషన్ తీసుకుంది. గురువారం జరిగిన సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.

రాజు సల్మాన్ అధ్యక్షతన..

రాజు సల్మాన్ అధ్యక్షతన..

వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో సౌదీ అరేబియా రాజు సల్మాన్ జీ-20 సదస్సు నిర్వహించారు. వైరస్ సోకి 21 వేల మంది చనిపోగా.. వేలాది ప్రజలు చికిత్స పొందుతున్నారు. వందల కోట్ల ప్రజలు ఇంటికే పరిమితమవుతోన్న నేపథ్యంలో సదస్సు నిర్వహించారు. వైరస్ వల్ల చిన్నాభిన్నమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తీసుకొచ్చేందుకు 5 ట్రిలియన్ అమెరికా డాలర్ల సాయం చేయాలని సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని సౌదీ అరేబియా రాజు సల్మాన్ సభ్యదేశాలను కోరారు.

ప్రతిజ్ఞ చేసి..

ప్రతిజ్ఞ చేసి..

సదస్సు ప్రారంభం కాగానే కరోనా వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుతామని ప్రపంచ దేశాధినేతలు పిలుపునిచ్చారు. ఆర్థిక విధానం ప్రకారం 5 ట్రిలియన్ డాలర్లు సమకూర్చాలనే సమావేశంలో చర్చకొచ్చిందని ప్రతినిధులు మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రాంతీయ బ్యాంకులతో కలిసి పనిచేస్తామని సమావేశంలో నాయకులు ప్రతిజ్ఞ చేశారు.

సుంకంపై కోతలు

సుంకంపై కోతలు


కరోనా వైరస్‌పై యుద్ధం చేయాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కోరారు. దీనిపై ప్రపంచ దేశాలు ఆలోచించాలని కోరారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లకుండా నిరోధించేందుకు సుంకంపై కోతలు విధించాలని సూచించారు. జిన్ పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైరస్‌కు సరిహద్దులు లేవని, వ్యాధిపై సాధారణ పౌరులు పోరాడుతున్నారని పేర్కొన్నారు. వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రపంచం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

English summary
The G20 nations have resolved to collectively inject $5 trillion into the global economy to combat the disruption caused by the coronavirus pandemic on economies world over
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X