వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను విగ్రహాన్ని కాదు ... నా ఫోటోలు కార్యాలయాల్లో అవసరం లేదు... ఉక్రెయిన్ అధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాల్లో, దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు గాని అయినప్పుడు వారి చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతారు. ఇది చాలా దేశాల్లో అమలవుతున్న సాంప్రదాయం. ఇక భారతదేశం లాంటి దేశాల్లో అయితే కార్యాలయాల్లో ఫోటోలు లేకుండా ఉంటే మాత్రం.. అది చాలా సీరియస్ అయిన విషయం. కానీ ఉక్రెయిన్ కు చెందిన దేశాధ్యక్షుడు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో అధ్యక్షుడి ఫోటోను ఉంచడంపై హుందాగా వ్యవహరించాడు.

ఉక్రెయిన్ దేశధ్యక్షుడిగా వ్లాదీమీర్ జెలెన్స్‌కీ నూతనంగా ఎన్నికయ్యాడు. పదవి స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన దేశంలోని ఇతర ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. తాను దేశ అధ్యక్షుడినే గాని ఒక విగ్రహాన్ని గాని , చిత్రపటాన్ని గాని కాదని అన్నారు.ఈనేపథ్యంలోనే తన ఫోటోలను ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల్లో పెట్టవద్దంటూ సూచించారు. కాగా ఆయన ఫోటోలకు బదులు వారి పిల్లల ఫోటోలను గోడలకు తగిలించాలని ఆయన అన్నారు.

I am not a idol or a portrait dont hang my photos :Volodymyr

దీంతో పిల్లల అభిప్రాయాలను ,నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన సూచించారు.
కాగా వ్లాదీమీర్ దేశ అధ్యక్షుడు కాకముందు.. ఆయన ఒక టీవీ కమెడియన్ గా పనిచేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని, అందరం కలిసి దేశాభివృద్ధి కోసం క‌ృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు.

English summary
really do not want my pictures in your offices, for the President is not an icon, an idol or a portrait. Hang your kids' photos instead, and look at them each time you are making a decision," Volodymyr Zelenskyy, Ukarine's new president said in his inaugural address today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X