వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ప్రధాని రాజీనామా, అధికారుల ఖండన (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాకిస్దాన్: పాకిస్దాన్‌‌లో జరుగుతోన్న గొడవ రాజకీయ సంక్షోభంగా ముదురుతోంది. దీంతో పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను పాక్ అధికార వర్గాలు ఖండించాయి. ప్రధాని నవాజ్ షరిఫ్ రాజీనామా కోరుతూ మాజీ క్రికెటర్ పాకిస్థాన్‌ తెహ్రీకె ఇన్సాఫ్‌(పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్, కెనడాకు చెందిన మత పెద్ద, పాకిస్దాన్ అవామీ తెహ్రీక్‌ (పీఏటీ) ఛీప్ తహిరుల్ ఖాద్రీ నాయకత్వంలో పార్లమెంట్‌ ప్రాంగణం ముట్టడి తీవ్రపరిణామాలకు దారితీస్తోంది.

ఆదివారం నాటి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో భద్రతాదళాలు సయంమనం పాటించాలని ఆర్మీ కోరింది. అయినా సోమవారం కూడా ఆందోళనకారులు-పోలీసులు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలు గత 18 రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాక్‌ ఆర్మీ అత్యవసర సమావేశం నిర్వహించింది. పాక్ సైన్యం మాత్రం దేశ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. పాలక పక్షం, ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఆందోళన కారులపై బలప్రయోగాన్ని నిలిపివేయాలని భద్రతాదళాలకు సూచించింది. ఐతే ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్‌తో ఆ దేశ సైనాధ్యక్షుడు రీహీల్ షరిఫ్ సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న అశాంతిని తొలగించడంపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లోని రెడ్ జోన్ ప్రాంతం (జాతీయ అసెంబ్లీ, ప్రధాని నివాసం తదితర కార్యలయాలు ఉంటే ప్రాంతం) గత రెండు రోజులుగా జరిగన ఘర్షణల్లో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు.

 ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులు - పోలీసులకి మధ్య జరిగిన ఘర్షణల్లో ధ్వంసమైన కారు.

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఇస్లామాబాద్‌లోని టీవి కార్యాలయాన్ని ఆందోళనకారులు కర్రలతో ధ్వంసం చేస్తున్న ఫోటో.

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

పోలీసులు - ఆందోళనకారుల ఘర్షణల్లో గాయపడ్డి పాకిస్థాన్‌ తెహ్రీకె ఇన్సాఫ్‌(పీటీఐ) కార్యకర్త.

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఇస్లామాబాద్‌లో పాక్ టీవి కార్యాలయాన్ని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. దీంతో ప్రసారాలు నిలిచిపోయాయి. అనంతరం రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆందోళనకారులను టీవి కార్యాలయం నుండి బయటకు పంపించేశాయి.

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ప్రధాని నవాజ్ షరిఫ్ రాజీనామా కోరుతూ మాజీ క్రికెటర్ పాకిస్థాన్‌ తెహ్రీకె ఇన్సాఫ్‌(పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్.

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

ఆందోళనలతో అట్టడుకుతున్న పాకిస్దాన్

పార్లమెంట్‌ ప్రాంగణం ముట్టడిలో పాల్గొన్న అందోళనకారులు. ఆదివారం నాటి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో భద్రతాదళాలు సయంమనం పాటించాలని ఆర్మీ కోరింది.

ఇది ఇలా ఉంటే మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌కు సొంత పార్టీ నుండే వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రధాని నివాసం ముట్టడిని పార్టీ అధ్యక్షుడు జావేద్‌ హష్మీ తప్పుపట్టారు. దేశంలో సైనిక పాలన వస్తే దానికి ఇమాన్‌ ఖాన్‌దే బాధ్యత అని హష్మీ అన్నారు. దీంతో హష్మీతోపాటు మరో ఇద్దరిని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ నుంచి బహిష్కరించారు.

అంతక ముందు జరిగిన ఆందోళనల్లో ఇస్లామాబాద్‌లో పాక్ టీవి కార్యాలయాన్ని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. దీంతో ప్రసారాలు నిలిచిపోయాయి. అనంతరం రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆందోళనకారులను టీవి కార్యాలయం నుండి బయటకు పంపించేశాయి. తర్వాత ప్రసారాలను పునరుద్దరించారు.

English summary
Protest in Pakistan took a violent turn as main opposition leader Imran Khan and cleric Tahir-ul-Qadri lost control over the protesters. Security around the residence of Prime Minister Nawaz Sharif has been tightened as agitators stormed TV channel office and stopped broadcast of news across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X