వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Taliban talks: ట్విన్ టవర్స్ దాడులకు, బిన్ లాడెన్ కు సంబంధం లేదు, అమెరికా ఏం పీకింది!

|
Google Oneindia TeluguNews

కాబూల్/ వాషింగ్టన్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ (ట్విన్ టవర్స్) దాడులకు ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం ఉందని ఎవ్వరి దగ్గర సాక్షాలు లేవని లాలిబన్లు అంటున్నారు. ఆల్ ఖైదా మీద 20 సంవత్సరాలు యుద్దం చేసిన అమెరికా ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కు వ్యతిరేకంగా సాక్షాలు సంపాధించలేదని, అసలు 20 ఏళ్లలో అమెరికా పీకింది ఏమీ లేదని, అలాంటప్పుడు అమెరికాలోని ట్విన్ టవర్స్ ను ఆల్ ఖైదా కూల్చి వేసిందని ఎలా చెబుతారని తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ఎన్ బిసీ న్యూస్ కు చెప్పారు. ప్రపంచంలో కొన్ని దేశాలను దగ్గర చేసుకోవడానికి తాలిబన్లు పదేపదే ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి వాగుతున్నారు. అమెరికా ట్విన్ టవర్స్ నూ కూల్చి వేలాది మంది ప్రాణాలు తీసింది ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అని ప్రపంచం మొత్తం మొత్తుకుంటున్నా తాలిబన్లు మాత్రం కొత్త రాగం తీస్తున్నారు. ఆఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ప్రతిరోజు ప్రపంచ దేశాల నాయకుల మద్దతు పొందడానికి, పలు దేశాల ప్రజల దృష్టిలో పడాలని పదేపదే ప్రెస్ మీట్లు పెట్టి దంచి కొడుతున్నారు.

Illegal affair: గ్రాండ్ గా భార్య బర్త్ డే పార్టీ, బెడ్ రూమ్ లో ప్రియుడితో బర్త్ డే బేబి, భర్త చూసి !Illegal affair: గ్రాండ్ గా భార్య బర్త్ డే పార్టీ, బెడ్ రూమ్ లో ప్రియుడితో బర్త్ డే బేబి, భర్త చూసి !

 తాలిబన్లు నరరూప రాక్షసులు

తాలిబన్లు నరరూప రాక్షసులు

అఫ్గానిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. అఫ్గానిస్తాన్ అధ్యక్షపదవిలో ఉన్న వ్యక్తి ఆదేశాన్ని వదిలి రాత్రికి రాత్రే వేరే దేశానికి చెక్కేసి అక్కడ తలదాచుకున్నాడంటే తాలిబన్లు ఎంత నరరూప రాక్షసులో కొత్తగా చెప్పనవసరం లేదు. వారం పది రోజుల్లోనే ఇప్పటికే తాలిబన్ల అరాచకాలు లెక్కలేనని వెలుగు చూశాయి.

తాలిబన్ల తిక్క తెలుసుకోవాలని మీడియా ఆసక్తి

తాలిబన్ల తిక్క తెలుసుకోవాలని మీడియా ఆసక్తి

అఫ్గానిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఎప్పుడు ఏమి చేస్తారో అని తెలుసుకోవడానికి మీడియా కూడా ఎక్కవగా ఆసక్తి చూపిస్తోంది. తాలిబన్లు తిక్క ఎంత ఉందో తెలుసుకోవాలని అంతర్జాతీయ మీడియా సైతం ఎక్కువగా ఆసక్తి కనపరచడంతో తాలిబన్లు ప్రతిరోజు కాబూల్ లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఏదో ఒకటి వాగుతున్నారు.

రాత్రాంతా రామాయణ విని పగలు సీతకు రాముడు ఏం కావాలని అడుగుతున్నారు

రాత్రాంతా రామాయణ విని పగలు సీతకు రాముడు ఏం కావాలని అడుగుతున్నారు

రాత్రాంతా రామయణం విన్నవాడు పగలు రాముడికి సీత ఏం కావాలి అని ప్రశ్నిస్తే ఎదుటి వాళ్లు ఎలా మండిపోతుందో ఇప్పుడు తాలిబన్ల తీరుతో అమెరికా ప్రజలు అలాగే మండిపోతున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ (ట్విన్ టవర్స్) దాడులకు ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం ఉందని ఎవ్వరి దగ్గర సాక్షాలు లేవని లాలిబన్లు అంటున్నారు.

ఒసామా బిన్ లాడెన్ కు వ్యతిరేకంగా సాక్షాలు ఉన్నాయా ?

ఒసామా బిన్ లాడెన్ కు వ్యతిరేకంగా సాక్షాలు ఉన్నాయా ?

అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ దాడులకు ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం ఉందని ఎవ్వరి దగ్గర సాక్షాలు లేవని లాలిబన్ నాయకులు అంటున్నారు. ఆల్ ఖైదా మీద 20 సంవత్సరాలు యుద్దం చేసిన అమెరికా ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కు వ్యతిరేకంగా సాక్షాలు సంపాధించలేదని, అలాంటప్పుడు 9/11 దాడుల్లో అమెరికాలోని ట్విన్ టవర్స్ ను ఆల్ ఖైదా కూల్చి వేసిందని ఎలా చెబుతారని తాలిబన్ లీడర్ జబివుల్లా ముజాహిద్ ప్రశ్నిస్తున్నాడు.

నాలుగు విమానాలు..... వేలాది మంది ప్రాణాలు

నాలుగు విమానాలు..... వేలాది మంది ప్రాణాలు


అమెరికాలోని ట్విన్ టవర్స్ ను 9/11 దాడులతో కూల్చి వేసిన ఆల్ ఖైదా ఉగ్రవాదులు అప్పుడు వేలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణం అయ్యారు. ఆల్ ఖైదా దాడుల వలనే అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయాయని ప్రపంచం మొత్తం అంటోంది. అయితే అమెరికా దాడులకు, ఆల్ ఖైదాకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్ నాయకుడు జబివుల్లా ముజాహిద్ బల్లగుద్ది చెప్పడంతో అమెరికా ప్రజలు మండిపడుతున్నారు.

20 సంవత్సరాలు అమెరికా ఏం పీకింది ?

20 సంవత్సరాలు అమెరికా ఏం పీకింది ?

అమెరికా ట్విన్ టవర్స్ కూలిపోయిన తరువాత అఫ్గానిస్తాన్ లో మకాం వేసిన అమెరికా దళాలు ఆల్ ఖైదాను అంతం చెయ్యడానికి ప్రయత్నించింది. 10 సంవత్సరాల పాటు ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కోసం గాలించింది. చివరికి 10 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్ ఆచూకి తెలుసుకున్న అమెరికా దళాలు అర్దరాత్రి దాడులు చేసి ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేసి కొంచెం ఊపిరిపీల్చుకున్నాయి.

ఒసామా బిన్ లాడెన్ అంటే ఎందుకు అంత భయం ?

ఒసామా బిన్ లాడెన్ అంటే ఎందుకు అంత భయం ?

సౌదీ అరేబియాలోని శ్రీమంతుల కుటుంబంలో 1957లో జన్మించిన ఒసామా బిన్ లాడెన్ అప్పట్లోనే లక్షాదికారి. ఇస్లామిక్ మత సిద్దాంతాలను పూర్తిగా జీర్ణించుకున్న ఒసామా బిన్ లాడెన్ 1988లో ఆల్ ఖైదా ఉగ్రవాదా సంస్థను ప్రారంభించాడు. 1996లో ఆఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తరువాత ఆల్ ఖైదాకు ఆశ్రయం ఇచ్చారు. ఆల్ ఖైదాకు తాలిబన్లు ఆశ్రయం ఇచ్చే విషయంలో పరోక్షంగా పాకిస్తాన్ కూడా పూర్తిగా ఆల్ ఖైదాకు సహకరించింది.

అమెరికా దెబ్బతో తోక ముడిచిన ఆల్ ఖైదా

అమెరికా దెబ్బతో తోక ముడిచిన ఆల్ ఖైదా

2001 సెప్టెంబర్ 9వ తేదీన ఆల్ ఖైదా ఆత్మాహుతి దాళాలు అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చి వేసి ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తరువాత అమెరికా, నాటో బలగాలు ఆఫ్గానిస్తాన్ లో తిష్టవేసి ఆల్ ఖైదాకు నిద్రలేకుండా చేశాయి. 10 సంవత్సరాలు నానా తంటాలు పడిన అమెరికా దళాలు చివరికి పాకిస్తాన్ లో ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేశాయి.

Recommended Video

Prime Minister Narendra Modi on Tuesday spoke to Russian President Vladimir Putin on Afghanistan
ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు

ఆఫ్గానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు

అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఇంకా అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఆ దేశం వదిలిపారిపోవాలని ఆదేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచిపారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అఫ్గానిస్తాన్ ప్రజలు దేశం విడిచిపారిపోకుండా తాలిబన్లు ఇప్పటికే అరాచకాలు మొదలుపెట్టారు.

English summary
Taliban spokesperson Zabihullah Mujahid said that there was no proof of Osama Bin Laden was involved in the 9/11 attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X