ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..!
ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి ఏకపక్షంగా దాడులు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా పురోగతి సాధించడంలో విఫలమైన అమెరికాకు ఇందులో నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump).. ఇరాన్ కు ప్రతిరోజూ హెచ్చరికలు చేస్తూ, డెడ్ లైన్లు పెడుతూ కాలం గడిపేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు 48 గంటల డెడ్ లైన్ పెట్టిన ట్రంప్.. మరోసారి వెనక్కి తగ్గేలా కనిపిస్తున్నారు.
ఇరాన్ లో మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేస్తానని హెచ్చరికలు చేసిన ట్రంప్ దానికి 48 గంటల గడువు పెట్టారు. అయితే ఆ గడువు భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రితో ముగియబోతోంది. దీంతో రేపు ఉదయానికి ఇరాన్ పై దాడులు చేయాల్సి ఉంది. అయితే తెరవెనుక చర్చలు జరుగుతున్నాయన్న కారణంతో మరోసారి ఈ దాడుల్ని వాయిదా వేసేందుకు ట్రంప్ సిద్దమవుతున్నట్లు సమాచారం అందుతోంది. చర్చల్లో పురోగతి ఉందని చెప్పి ఈ దాడుల్ని ట్రంప్ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ఆక్సియోస్ నివేదించింది.

ఇరాన్ తో ఒప్పందం కుదురుతున్నట్లు భావిస్తే ట్రంప్ బహుశా దాడులను వాయిదా వేస్తారని, కానీ ఆ నిర్ణయం తీసుకునేది ఆయన మాత్రమేనని ఓ సీనియర్ అధికారి చెప్పినట్లు ఆక్సియోస్ తెలిపింది. దౌత్యం లేదా సైనిక ఉద్రిక్తతలలో ఏది నెగ్గుతుందో నిర్ణయించడంలో ట్రంప్ పోషిస్తున్న కీలక పాత్రను ఇది స్పష్టం చేస్తోంది. అయితే ట్రంప్ ఇరాన్‌కు మరింత గడువు ఇస్తారనే విషయంలో తమకు అనుమానాలు ఉన్నట్లు మరో రక్షణ అధికారి తెలిపారు. దీంతో చర్చలకు ఉన్న అవకాశాలు వేగంగా తగ్గిపోవచ్చని పేర్కొన్నారు. దౌత్య వ్యవహారాలు లేదా ట్రంప్ ఆలోచనా విధానంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న ఆరుగురు అధికారులు, ఇతర వర్గాలతో జరిపిన ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక.. ఇవాళ రాత్రి 8 గంటల గడువు సమీపిస్తున్న తరుణంలో వైట్ హౌస్ ఎదుర్కొంటున్న నిర్ణయం ఎంత కీలకమైనదో స్పష్టం చేస్తోంది.
-
జేడీ వాన్స్ అవుట్..? ట్రంప్ ఊహించని షాక్..?? -
ఎల్లుండే.. పాకిస్తాన్ లో ఏం జరగబోతోంది -
అమెరికా- ఇరాన్ మధ్య సడన్ సీజ్ ఫైర్: 10 పాయింట్స్ ఫార్ములా -
లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? -
మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నాయి.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్ -
అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ మధ్యవర్తి పాక్ కాదా ? అసలు బ్రోకర్ ఎవరంటే ? -
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
Iran War: సీజ్ ఫైర్ బ్రేక్-మళ్లీ హార్ముజ్ మూసేసిన ఇరాన్..! -
ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..! -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో.. -
"యుద్ద చరిత్ర తిరగరాసిన ఇరాన్"-జనసేన నేత ప్రశంసలు..! -
కోడిగుడ్డు అక్షరాల రూ.25 వేలు..? -
పరగడుపున నిమ్మరసం తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..!!














Click it and Unblock the Notifications