కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

video:ఆవులను కాపాడిన మత్స్యకారులు భేష్, లోకేశ్ అభినందనలు

|
Google Oneindia TeluguNews

న‌ల్ల‌మ‌ల అడ‌వుల‌ను అనుకుని ఎన్టీఆర్ బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్‌ ఉంది. ఆ ప‌రిస‌రాల్లోకి మేత కోసం ఆవులు, గేదెల మంద‌ వెళ్లాయి. అయితే అడ‌వి పందుల‌ను చూసి అవి బెదిరిపోయాయి. నీటిలోకి దాదాపు 350 వరకు దుకాయి. ఆ ఆవుల‌ను అక్కడే ఉన్న మ‌త్స్య‌కారులు రక్షించారు. వాటిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది.

న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతాన్ని ఆనుకుని బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయర్ ఉండ‌టంతో దాని ప‌రిస‌రాల్లో ఆవులు, గేదెల‌ను మేత కోసం వాటి య‌జ‌మానులు తీసుకెళుతుంటారు.
అడ‌విలో నుంచి పందుల స‌మూహం వేగంగా ప‌రుగులు తీసి వచ్చింది. దీంతో గోవుల మంద‌లోని కొన్ని ఆవులు రిజ‌ర్వాయర్‌లోని నీటిలోకి దూకేశాయి. షాక్‌కు గురైన కాప‌రులు స‌మీపంలో ఉన్న మత్స్య‌కారుల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌గా... వారు చిన్న బోట్ల‌తో నీటిలోకి వెళ్లి ఆవుల‌ను ఒడ్డుకు చేర్చారు.

nara lokesh praised to fisherman who rescue cows

నీటిలోకి దూకిన ఆవుల‌ను మ‌త్స్య‌కారులు సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ వీడియోను టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూగ జీవాలు ఆవుల మంద‌ను చాక‌చ‌క్యంగా మ‌త్స్య‌కారులు ఒడ్డుకు త‌ర‌లించార‌ని లోకేశ్ పేర్కొన్నారు. మ‌త్స్య‌కారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఆవుల‌ను కాపాడిన మ‌త్స్య‌కారులు, ఆవుల‌పై ఆధార‌ప‌డిన పాడి రైతు కుటుంబాల‌ను కూడా కాపాడిన‌ట్టేన‌ని పేర్కొన్నారు.


English summary
nara lokesh praised to fisherman who rescued cows at ntr balancing reservoir
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X