సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుబ్బాక చేనేత పరిశ్రమలో.. సినీనటి సమంత సందడి

తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన తరువాత తొలిసారిగా సినీనటి సమంత సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో చేనేత వస్త్ర పరిశ్రమను సందర్శించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సిద్దిపేట: సినీనటి సమంత సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో సందడి చేశారు. తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఆమె దుబ్బాకలోని చేనేత వస్త్ర పరిశ్రమను సందర్శించారు.

చేనేత సంఘ ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను సమంత పరిశీలించారు. మరమగ్గాలను, ఇతర పనిముట్లను ఆసక్తిగా పరిశీలించారు.

Actress Samantha Visited Dubbaka Handlooms Society

అలాగే చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి పలు విషయాలు అక్కడి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

అయితే తాను అధికారికంగా రాలేదని, చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు తన దగ్గర కొన్ని ఆలోచనలున్నాయని.. దీనిపై మరిన్ని విషయాలు తరువాత మాట్లాడతానని సమంత చెప్పారు. తిరిగి వెళ్లేటప్పుడు శాంపిల్ గా తనతోపాటు ఆమె కొన్ని చీరలు కూడా తీసుకెళ్లారు.

English summary
We already knew that Actress Samantha is brand ambassador for Telangana handlooms, to promote handlooms, actress samantha visited Dubbaka Handloom Co-Operative Society in Siddipet district. she interacted with the Weavers at the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X