వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు, కేసీఆర్: మోడీ ఫోన్ చేశారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం కలిశారు. మొదట చంద్రబాబునాయుడు గవర్నర్ నివాసానికి వెళ్ళి.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన గవర్నర్ నర్సింహన్.. ఆయన సతీమణికి, చంద్రబాబుకు కేక్ తినిపించారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు.. నర్సింహన్‌కు కేక్ తినిపించారు. చంద్రబాబు తనకు పాత మిత్రుడని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు. తాను గవర్నర్ కాకముందునుంచే చంద్రబాబు తెలుసని చెప్పారు.

ఈ సందర్భంగా నర్సింహన్‌తో చంద్రబాబునాయుడు అరగంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంపై చర్చించినట్లు తెలిసింది.

అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని కేసీఆర్ కోరుకున్నారు.

ఇది ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ.. గవర్నర్ నర్సింహన్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

గవర్నర్‌తో బాబు

గవర్నర్‌తో బాబు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం కలిశారు.

కేక్ తినిపిస్తూ..

కేక్ తినిపిస్తూ..

మొదట చంద్రబాబునాయుడు గవర్నర్ నివాసానికి వెళ్ళి ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన గవర్నర్ నర్సింహన్.. ఆయన సతీమణికి, చంద్రబాబుకు కేక్ తినిపించారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు.. నర్సింహన్‌కు కేక్ తినిపించారు.

పాత స్నేహితుడే

పాత స్నేహితుడే

చంద్రబాబు తనకు పాత మిత్రుడని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు. తాను గవర్నర్ కాకముందునుంచే చంద్రబాబు తెలుసని చెప్పారు. ఈ సందర్భంగా నర్సింహన్‌తో చంద్రబాబునాయుడు అరగంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంపై చర్చించినట్లు తెలిసింది.

కేసీఆర్

కేసీఆర్

అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

నిండునూరేళ్లు..

నిండునూరేళ్లు..

గవర్నర్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగాకేసీఆర్ కోరుకున్నారు. ఇది ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ.. గవర్నర్ నర్సింహన్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్‌కు ఫోన్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Andhra Pradesh and Telangana CMs Chandrababu Naidu and K Chandrasekhar Rao on Friday met Governor Narasimhan and wished him very happy birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X