పొలిటికల్ ఫైట్-2019: ఏ పార్టీ ఎటువైపు? కోదండరాం, కాంగ్రెస్ దోస్తీ ఉంటుందా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఇప్పటికే ఒక స్పష్టత రాగా.. తెలంగాణ విషయంలో మాత్రం ఇంకా ఎటూ తేలలేదు. ఇక్కడ ఏయే పార్టీలు ఎవరితో కలిసి నడుస్తాయన్న విషయాన్ని కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి.

ఒక్కడితో సాధ్యమేనా?:

ఒక్కడితో సాధ్యమేనా?:

కేసీఆర్‌ను ఎదుర్కొనే సమవుజ్జీ ప్రతిపక్షాల్లో ఇప్పటికైతే కానరావట్లేదనే అభిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం కొత్త పార్టీతో ముందుకు రావడం.. కేసీఆర్ అప్రతిహత యాత్రకు చెక్ పెడుతుందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే కోదండరాం ఒక్కరే ఒంటరిగా కేసీఆర్‌ను ఎదుర్కోగలరా?.. ఇందుకోసం ఇతర పార్టీలతో కలిసి నడుస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

కోదండరాం ఎటువైపు:

కోదండరాం ఎటువైపు:

కోదండరాం కాంగ్రెస్ పార్టీకి డైరెక్షన్ లో పనిచేస్తున్నారని అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పైగా రాష్ట్రంలో 'రెడ్డి'లంతా ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదన కూడా ఉంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌తో జతకడితే.. టీఆర్ఎస్ ఆరోపణలకు బలం చేకూర్చినట్టవుతుందని కోదండరాం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌తో కలవకపోవచ్చు:

కాంగ్రెస్‌తో కలవకపోవచ్చు:


కాంగ్రెస్ పార్టీ, కోదండరాం 'తెలంగాణ జనసమితి' జతకట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కష్ట సాధ్యమని.., పైగా ఎవరికి వారు ఒంటరిగానే అధికారంలోకి రావాలని భావిస్తున్నందునా.. పొత్తు సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు.

అదే జరిగితే తెలంగాణలో ప్రధాన పోరు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం ద్వారా టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవచ్చునన్నది మరికొంతమంది వాదన.

 టీఆర్ఎస్-ఎంఐఎం:

టీఆర్ఎస్-ఎంఐఎం:

ఇక టీఆర్ఎస్ విషయానికొస్తే.. గతంలో లాగే ఒంటరిగా బరిలో దిగేందుకే ఆ పార్టీ సన్నద్దమవుతోంది. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీతో అధికార పార్టీకి ఉన్న సత్సంబంధాల గురించి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే జనసేనతో జతకట్టిన వామపక్షాలు తెలంగాణలోనూ అదే పార్టీతో కలిసి నడిచే అవకాశాలున్నాయి. లేనిపక్షంలో కోదండరాం 'తెలంగాణ జనసమితి'తో కలిసి ఆ పార్టీ పనిచేయవచ్చు.

బీజేపీ కూడా ఒంటరిగానే..:

బీజేపీ కూడా ఒంటరిగానే..:

బీజేపీ విషయానికొస్తే.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఆ పార్టీకి కొన్ని బలమైన స్థానాలున్నాయి. అటు అధికార పార్టీతోనూ, ఇటు కాంగ్రెస్ తోనూ ఆ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి.. ఒంటరిగానే బీజేపీ రంగంలోకి దిగుతుందని అంటున్నారు.

అప్పుడే అంచనా కష్టం..

అప్పుడే అంచనా కష్టం..

ఎన్నికల గడువు దగ్గరపడితే తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చునన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కోసం ప్రతిపక్షాలను ఏకతాటి పైకి తీసుకొచ్చే తెర వెనుక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
కాబట్టి 2019 పొలిటికల్ ఫైట్‌ను అప్పుడే అంచనా వేయలేమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో.. తెలంగాణ ముఖచిత్రంపై రాజకీయ సమీకరణాలు ఇంకా స్పష్టమవలేదనే చెప్పాలి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For the ensuing general elections, battle lines have been cleared by political parties in Andhra Pradesh but in Telangana, it is not yet clear.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X