సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ నాటికి తెలంగాణలో 100 శాతం వ్యాక్సినేషన్ టార్గెట్: మంత్రి హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/సిద్దిపేట: రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలోగా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం కరోనా వ్యాక్సినేషన్‌పై డీఎంహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.

డిసెంబర్‌‌లోగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనిహరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్‌, రెండో డోస్‌ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్‌సెంటర్‌ స్థాయి, పీహెచ్‌సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకొని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల కొవిడ్‌ టీకా వేసుకునేలా చూడాలని ఆదేశించారు.

 covid vaccination should be completed by december 2021: harish rao

అంతేగాక, ప్రజల్లో టీకాపై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ప్రత్యేకంగా కాలేజీ క్యాంపస్‌లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాయాలు, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లపై దృష్టి సారించి.. అక్కడే వ్యాక్సినేషన్‌ చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.55కోట్ల డోసులు వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3.60కోట్ల డోసులు వేశామని.. మరో 1.90కోట్లు వేయాల్సి ఉందన్నారు. వ్యాక్సినేషన్‌ 80శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల వైద్యాధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో మంత్రి ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

డిసెంబర్‌లోగా వందశాతం వ్యాక్సినేషన్‌ జరుగాలని, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ దీక్షతో పని చేయాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. మాతా శిశు సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. రక్తహీనతపై అవగాహన కల్పించి, అవసరమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Recommended Video

Farms Laws వెనక్కి తీసుకోవడం KCR విజయం! - TRS నేతలు || Oneindia Telugu

ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్న మంత్రి.. గర్భిణీ స్త్రీలు, పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచండి.. సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేపట్టాలి సూచించారు.
టెలీకాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కమిషనర్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ వాకాటి కరుణ, డైరెక్టర్‌ హెల్త్‌ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్‌డీ గంగాధర్‌ పాల్గొన్నారు.

English summary
covid vaccination should be completed by december 2021: harish rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X