హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు వచ్చి షాకింగ్ న్యూస్ చెప్పిన దిగ్విజయ్, బిస్కట్ తింటూ.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇన్నేళ్లు హైదరాబాదులో మీకు అవకాశమిస్తే ఏం చేశారని అధికార తెరాస... కాంగ్రెస్, టిడిపి, బిజెపిలను నిలదీస్తోంది.

దానికి విపక్షాలు గట్టి కౌంటర్ ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ కలల లోకంలో విహరింప చేయడమే తప్ప చేసిందేమీ లేదని అంటున్నాయి. హైదరాబాదుకు గోదావరి నీళ్లు తాము తెస్తే తెరాస నేతలు ఫోజులు కొడుతున్నారని, తామే ఇళ్లు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

హైదరాబాదును హైటెక్ సిటీగా చేసి, ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబు అయితే.. మంత్రి కెటిఆర్ గూగుల్ కార్యాలయానికి వెళ్లి ఫోజులు కొడుతున్నారని టిడిపి నేతలు, కేంద్రం సాయం లేకుండానే తెలంగాణ ముందుకు పోతోందా అని బిజెపి గట్టి కౌంటర్ ఇస్తోంది.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానినీ నెరవేర్చకుండా ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ దిగ్విజయ్‌ సింగ్‌ బుధవారం విమర్శించారు. హామీలను విస్మరించడంలో మోడీ, కేసీఆర్‌ నిష్ణాతులన్నారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ, ఎంపీ వి హనుమంత రావు, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా తదితరులతో కలిసి దిగ్విజయ్‌ విలేకరులతో మాట్లాడారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని, ఈ నెల 17 కల్లా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి, 18న ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తామన్నారు. వార్డుల పునర్విభజనలో శాస్త్రీయత లోపించిందని, రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత నిబంధనల ప్రకారం గడువు ఇవ్వకుండానే షెడ్యూల్‌ జారీ చేశారని ఆరోపించారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

పఠాన్‌కోట్‌ ఘటనలో కేంద్ర వైఫ్యలం ఉందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దిగ్విజయ్‌ డిమాండ్‌ చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పూర్వీకుల ఇంట్లో జరిగిన ఓ విందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం హాజరయ్యారని, ఇదే విందులో ప్రధాని మోడీ పాల్గొన్నారని ఐబీఎన్‌ 7 మీడియా సంస్థ ప్రసారం చేసిన కథనంపై విచారణ జరిపించాలని షాకిచ్చారు.

సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా

సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అవినీతికి వ్యతిరేకమంటూ సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా తదితర పార్టీలు కూటమిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా

సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అవినీతికి వ్యతిరేకమంటూ సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా తదితర పార్టీలు కూటమిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

దైనందిని విడుదల

దైనందిని విడుదల

భారతీయ జనతా పార్టీ దైనందినిని విడుదల చేస్తున్న బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, తదితరుల దృశ్యం.

దైనందిని విడుదల

దైనందిని విడుదల

భారతీయ జనతా పార్టీ దైనందినిని విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి.

English summary
Congress leader Digvijay Singh lashes out at PM Modi, Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X