Disha case:మృతుల కుటుంబాల ఆవేదన ..నా భర్తతో పాటు నన్ను కూడా చంపెయ్యండన్న చెన్నకేశవులు భార్య
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళలకు భద్రత లేదని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య, నిందితులను ఎన్కౌంటర్ చేయడం తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది. ఇక ఈ ఘటనపై దేశం మొత్తం దాదాపుగా హర్షం వ్యక్తం చేస్తుంటే పలువురు విమర్శిస్తున్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకోవటం సమాజానికి మంచిది కాదని అంటున్నారు. ఇక ఈ ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన వారి కుటుంబాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
Recommended Video

నిండు గర్భిణి అయిన చెన్నకేశవులు భార్య ఆవేదన
తాజాగా తన భర్తను ఎన్ కౌంటర్ లో చంపేయడంపై దిశను రేప్ చేసి చంపిన చెన్నకేశవులు భార్య లక్ష్మీ స్పందించింది.చెన్నకేశవులు భార్య గర్భిణి కావటంతో చెన్నకేశవులు పుట్టింటి కి పంపాడు. నెలలు నిండిన ఈమె ప్రసవానికి పుట్టింట్లో ఉంది. ఇక ఇదే సమయంలో చెన్నకేశవులు మాత్రం దిశను హైదరాబాద్ లో దారుణంగా హత్యాచారం చేసి చంపేశాడు. నలుగురు నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. చెన్నకేశవులు ఎన్ కౌంటర్ తో ఇప్పుడు ఆయన భార్య లక్ష్మీ పరిస్థితి దారుణంగా తయారైంది.

తన భర్తను చంపినట్టే తనను చంపాలన్న చెన్నకేశవులు భార్య
ఈ ఘటనతో కన్నీరు మున్నీరు అవుతున్న లక్ష్మీ తన భర్త తప్పు చేశాడని పోలీసులు కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధిస్తే బాగుండేదని ఆమె అంటుంది. కానీ ఇలా ఎన్ కౌంటర్ చేయడం మంచిది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది అన్యాయం అని ఆమె పేర్కొంది. తన భర్తను చంపినట్టే తనను కూడా చంపాలని ఆవేదన వ్యక్తం చేసింది.

శవ పంచనామా పూర్తి.. ఘటనా స్థలిలో మృతుల కుటుంబీకులు
చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఎక్కడైతే దిశను సజీవ దహనం చేశారో, అక్కడికి 300 మీటర్ల దూరంలో నలుగురు నిందితులనూ ఎన్ కౌంటర్ లో హతమార్చిన పోలీసులు, వారి తల్లిదండ్రులను శంషాబాద్ కు తీసుకుని వచ్చారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇప్పటికే శవ పంచనామా పూర్తి కాగా, వారి తల్లిదండ్రులు, ముఖ్య బంధువుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను వారికి అప్పగించనున్నారు .
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications