హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ గ్యాంగ్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్-అసలు వాస్తవం ఇదీ-సంతోష్ నగర్ కేసులోనూ సంచలన విషయాలు

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన గాంధీ ఆస్పత్రి గ్యాంగ్ రేప్ కేసులో అసలు వాస్తవాలు వెలుగుచూశాయి. అసలు ఆ అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు నిర్దారించారు. బాధితురాలు కట్టు కథ అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించిందని తేల్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్,సీసీటీవీ ఫుటేజీల పరిశీలన,సుమారు 200 మందిని విచారించిన అనంతరం పోలీసులు ఈ నిర్దారణకు వచ్చారు. అదృశ్యమైన మహిళను ఎవరూ కిడ్నాప్ చేయలేదని నిర్దారించారు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుతో ఆమె వెళ్లినట్లు గుర్తించారు.

Recommended Video

Kalva Sujatha questioned what would have happened to the police system
వాస్తవం ఇదీ...

వాస్తవం ఇదీ...


మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో ఈ నెల 4న అతన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. రోగికి సాయంగా అతని భార్యతో పాటు ఆమె చెల్లెలు ఆస్పత్రికి వచ్చారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చాలాకాలంగా కల్లుకు బానిసలయ్యారు. కల్లు తాగకపోతే వీరి మానసిక స్థితి సరిగా ఉండదు. ఆస్పత్రికి వచ్చాక కల్లుకు దూరమవడంతో మానసిక స్థితిలో మార్పు వచ్చింది. ఈ నెల 11న అక్క ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లింది. చెల్లెల్లు 15వ తేదీ వరకు ఆస్పత్రి ఆవరణలోనే ఉంది. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుతో ఆమె సన్నిహితంగా మెలిగింది. అయితే ఆమెపై అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

కల్లుకు అడిక్ట్ అయ్యారని చెప్పిన ఆర్ఎంపీ

కల్లుకు అడిక్ట్ అయ్యారని చెప్పిన ఆర్ఎంపీ

ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిపోయిన మహిళను గురువారం(ఆగస్టు 18) నారాయణగూడలోని ఓ మెడికల్ షాప్ వద్ద పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలపై ఆరా తీసినట్లు సమాచారం.అనంతరం ఆమెను భరోసా సెంటర్‌కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు నివాసముండే మహబూబ్ నగర్‌లో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని ఆరా తీయగా వారు కల్లుకు అడిక్ట్ అయినట్లు ధ్రువీకరించారు.

ముందు నుంచి అనుమానాలే...

ముందు నుంచి అనుమానాలే...

ఈ కేసు విషయంలో పోలీసులకు ముందు నుంచి తేడా కొడుతూనే ఉంది. బాధితురాలు చెబుతున్న దానికి గ్రౌండ్ రియాలిటీకి పొంతన కుదరలేదు. సీసీటీవీ ఫుటేజీల్లోనూ,నిందితుల విచారణలోనూ ఎక్కడ ఏ చిన్న అధారం లభించలేదు. దాదాపు 200 మందిని పోలీసులు విచారించారు. పైగా ఫోరెన్సిక్ రిపోర్టులోనూ ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. క్లోరోఫామ్ లేదా ఇతర మత్తు పదార్థాలేవీ వారిపై ప్రయోగించలేదని తేలింది. పోలీసులు నగరంలోని చాలా చోట్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అదృశ్యమైన మహిళ ముషీరాబాద్ వైపు వెళ్తున్నట్లుగా అందులో రికార్డయింది. దీంతో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లన్నింటికీ ఆమె ఫోటోను పంపించారు. ఆ మహిళ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టకేలకు నారాయణగూడ ప్రాంతంలో ఆమె ఆచూకీ దొరికింది. పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ... ఈ కేసులో గ్యాంగ్ రేప్ మాత్రం జరగలేదని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కూడా వట్టిదే...

సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కూడా వట్టిదే...

సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు కూడా కట్టు కథేనని పోలీసులు తేల్చారు. ప్రియుడు తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండటంతో... అతన్ని ఇరికించాలనే ఉద్దేశంతోనే సదరు యువతి ఈ డ్రామాకు తెరలేపినట్లు నిర్దారించారు. తాను ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా మూడు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరానని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ప్యాసింజర్ ఆటో ఎక్కాను. నాతో పాటు ఆటో ఎక్కిన మహిళ మిథాని డిపో వద్ద దిగిపోయింది. నాకు అంతలోనే నిద్రపట్టగా.. మెలకువ వచ్చేసరికి ఆటో షాహినగర్‌లో ఉంది. అప్పటికి ఆటోలో నాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను పహాడీషరీఫ్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హింసించి గ్యాంగ్‌ రేప్ చేశారు.' అని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్... ఇలా తేల్చారు...

సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్... ఇలా తేల్చారు...

ఈ ఘటనపై సంతోష్‌నగర్ పోలీసులు ఐపీసీ 363, 376(డి), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.నిందితుల గాలింపు కోసం సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. యాదగిరి థియేటర్‌ నుంచి పహాడీషరీఫ్‌ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఒక్క క్లూ కూడా లభించలేదు. బాధితురాలి ఫిర్యాదుకు,గ్రౌండ్ రియాలిటీకి ఎక్కడా పొంతన కుదరలేదు. యువతి ఇంటి నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ 2కిలోమీటర్లు కూడా లేదని గుర్తించారు. అలాంటిది ఆమె యాదగిరి థియేటర్‌ వరకు వచ్చి ఆటో ఎందుకు ఎక్కిందని పోలీసులు సందేహించారు. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో రాత్రి 9 గంటల సమయంలో ఆమెను కిడ్నాప్ చేయడం సాధ్యమా? నిజంగానే తాను ఆపదలో ఉన్నట్లు గుర్తిస్తే యువతి ఎందుకు కేకలు పెట్టలేదు? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఆ కక్షతోనే నాటకం...

ఆ కక్షతోనే నాటకం...

బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి ప్రధాన రహదారి, వాటిని ఆనుకుని ఉండే సైడ్ రోడ్స్, నిర్మానుష్య ప్రాంతాలకు దారితీసే చోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటిల్లో కనిపించిన ఆటోలు ఏ మార్గం నుంచి వెళ్లాయో ఆరా తీశారు. సంతోష్‌ నగర్‌ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌ ప్రాంతాల్లో సెల్‌ టవర్‌ సిగ్నళ్లను కూడా విశ్లేషించారు. పలువురు ఆటో డ్రైవర్లను విచారించినా ఒక్క ఆధారం లభించలేదు. దీంతో యువతి ఫిర్యాదుపై పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఆమెను పదేపదే అనేక కోణాల్లో విచారించగా అసలు విషయం తేలింది. తాను ప్రేమించిన వ్యక్తికి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడని, ఆ కక్షతోనే అతడిని కేసులో ఇరికించేందుకు నాటకమాడినట్లు అంగీకరించింది.

గతంలో ఘట్‌కేసర్ కేసు కూడా ఇలాగే...

గతంలో ఘట్‌కేసర్ కేసు కూడా ఇలాగే...


ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలనం రేకెత్తించిన ఘట్‌కేసర్‌లో బీఫార్మసీ గ్యాంగ్ రేప్ ఘటన కూడా కట్టు కథేనని తేలిన సంగతి తెలిసిందే. ఇంట్లో వాళ్లపై అలిగి ఇంటికి వెళ్లలేక యువతి ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చేశారు. ఆమెకు కిడ్నాప్‌ బ్యాక్‌ డ్రాప్ కథలంటే ఇష్టం ఉండటంతో... కిడ్నాప్ నాటకమాడినట్లు నిర్దారించారు. గతంలో ఓసారి చిల్లర విషయంలో ఓ ఆటో డ్రైవర్‌తో గొడవ జరగడంతో... ఆమె వారిని టార్గెట్ చేసినట్లు తేల్చారు. అటు పోలీసులను,ఇటు తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించి.. అనవసరంగా ఆటో డ్రైవర్లపై ఆరోపణలు చేసిన ఆ యువతి చివరకు ఆత్మహత్య చేసుకుంది.

English summary
The real facts of the Gandhi Hospital gang-rape case, which caused a stir in the state, have come to light. The police confirmed that there was no gang rape on the sisters. The victim was found to have misled the police with a fabricated story
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X