శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే!
తెలంగాణ ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్నమైన పథకాలను తీసుకువచ్చి అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పేరుతో రేషన్ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికీ జీవిత బీమాను అందించనుంది. ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకంపై బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను పెట్టారు. రూ. 3,24,234 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో, రాబోయే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న పలు కొత్త పథకాలను ఆయన ప్రకటించారు. వాటిలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' ఒకటి.ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు 5లక్షల జీవిత బీమా
ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రేషన్ కార్డుదారులకు, రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు 5లక్షల జీవిత బీమా వర్తిస్తుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి 15 లక్షల కుటుంబాలు లబ్ధిని పొందుతాయని తెలిపారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
బడ్జెట్లో ఏకంగా నాలుగువేల కోట్ల రూపాయల కేటాయింపు
రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అండగా నిలిచే ఉద్దేశంతో ఈ పథకం అందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ఏకంగా నాలుగువేల కోట్ల రూపాయలను కేటాయించారు.ఇదే సమయంలో రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా పథకం గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం
పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులకు ఈ పథకం కింద సహజ మరణం జరిగినా, ప్రమాదవశాత్తు మరణించినా వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. రేషన్ కార్డు ఉన్న అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో, ఈ సమయంలో రైతు బీమాను కొనసాగిస్తారా లేదా అన్న చర్చ జరుగుతుంది.
రైతు బీమా విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో
సహజంగా రైతులందరికీ దాదాపు రేషన్ కార్డులు ఉన్న క్రమంలో, మరి రైతు బీమా విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. దీనిపైన ప్రభుత్వం నుండి ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
-
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?













Click it and Unblock the Notifications