హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ - ఐటీ కంపెనీల అమలు : ఉద్యోగులకు ఆదేశాలు జారీ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90 వేలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. మరో ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. దీంతో.. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న పలు ప్రముఖ ఐటీ సంస్థలు కీలక నిర్ణయం ప్రకటించాయి. మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. గతంలో కరోనా కారణంగా దాదాపుగా ఏడాదిన్నార పాటు ఐటీ ఉద్యో గులు వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టటంతో తిరిగి క్రమేణా కార్యాలయాలు తెరుచుకున్నాయి.

ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని

ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని

సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా, బుధవారం నుంచి మరికొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇదే విధంగా సూచించినట్లు స్థానిక ఐటీ పరిశ్రమ వర్గాలు వివరించాయి. 'ఒమిక్రాన్‌' ముప్పు ఇంకా పెరిగితే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పైనా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో కంపెనీలు, సిబ్బందికి ఏడాదిన్నర అనుభవం ఉంది. ఐటీ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేందుకు, ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనువైన సాంకేతిక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నందున, కార్యకలాపాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

పెరుగుతున్న కేసులతో ముందస్తుగా

పెరుగుతున్న కేసులతో ముందస్తుగా

అక్టోబరు నాటికి మొత్తం ఐటీ ఉద్యోగుల్లో 15- 20 శాతం మంది కార్యాలయాలకు వచ్చి పనిచేయటం కనిపించింది. నెమ్మదిగా ఈ సంఖ్య పెరుగుతుందని, త్వరలో అత్యధిక ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావించారు. కానీ, అనూహ్యంగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కేసుల తీవ్రత కారణంగా ఐటీనే కాకుండా దేశంలోని ఇతర రంగాలకు చెందిన పలు సంస్థలు కూడా ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన పలు వ్యాపార సంస్థలు కూడా తాజా పరిణామాల దృష్ట్యా తమకు అనువైన చర్యలను తీసుకుంటున్నాయి. ఉద్యోగులు కూడా కరోనా భయంతో ఆఫీసులకు రావడానికి జంకుతున్నారు.

ఉద్యోగులకు కంపెనీల ఆదేశాలు

ఉద్యోగులకు కంపెనీల ఆదేశాలు


హైబ్రిడ్‌ వర్క్‌ పద్ధతికి ఇంతకు ముందు నుంచే అలవాటు పడ్డామని, దీన్ని మళ్లీ అమల్లోకి తీసుకువస్తున్నట్లు కొన్ని దిగ్గజ కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. అయితే, కేసులు తగ్గుముఖం పడితే తిరిగి ఉద్యోగులు కార్యాలయాలకు రాక మొదలవుతుందని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా తమ కంపెనీ పని తీరు లో నెగటివ్ ప్రభావం లేదని విశ్లేషిస్తున్నారు. దీంతో..ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని తిరిగి వర్క్ ఫ్రం హోం అమలుకు ఐటీ పరిశ్రమ నిర్ణయించింది.

English summary
IT companies issued guide lines on again work from home due to omicron cases in present situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X