నా తమ్ముడికి ఓటెయ్యండి; కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్; మునుగోడులో కాంగ్రెస్ కు షాక్!!

మునుగోడు ఉపఎన్నికలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక కు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్యుద్ధం కొనసాగుతుంది.

వైరల్ అవుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ ఆడియో

వైరల్ అవుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ ఆడియో

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే తన తమ్ముడికి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన తమ్ముడికి మద్దతు ఇవ్వాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో చెప్పినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిపిసిసి స్టార్ క్యాంపెయినర్ రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించక పోగా, పార్టీకి నష్టం చేస్తున్నారన్న అభిప్రాయం తాజాగా వైరల్ అవుతున్న ఆయన ఆడియో తో పార్టీలో వ్యక్తమౌతుంది.

మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి : ఫోన్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి : ఫోన్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ కాంగ్రెస్ లీడర్ తో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు తన ఆడియో కాల్ లో మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తే ఆ తర్వాత తను టి పి సి సి ప్రెసిడెంట్ అవుతానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఫోన్ కాల్ లో మాట్లాడినట్టు ఆ ఆడియో కాల్ ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత తను రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని అందులో పేర్కొన్నారు.

ప్రస్తుతం పార్టీలను చూడకుండా ఓటెయ్యండన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రస్తుతం పార్టీలను చూడకుండా ఓటెయ్యండన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రస్తుతం పార్టీలను చూడకుండా రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియోలో కోరారు. ఇక ఏదైనా ఉంటే తాను చూసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నట్టు ఆ ఆడియో కాల్ ని బట్టి అర్థమవుతుంది. ఇక చచ్చినా బతికినా, దేనికైనా సరే రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు. అందుకే తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్టుగా ఒక ఆడియో వైరల్ గా మారింది.

సొంత పార్టీ నేతలపై రేవంత్ ఆరోపణల తర్వాత బయటకు వచ్చిన ఆడియో

సొంత పార్టీ నేతలపై రేవంత్ ఆరోపణల తర్వాత బయటకు వచ్చిన ఆడియో

ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందని, మునుగోడు లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తనను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం సొంత పార్టీ నేతలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ అవడంతో, అందులో ఆయన టీపీసీసీ పదవి గురించి మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా సాగుతున్న వర్గపోరు మరోమారు బయటకు వచ్చింది. పార్టీ నేతల ఆధిపత్య ధోరణితో పార్టీని నాశనం చేస్తున్నారని చర్చ జోరుగా సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+