హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టార్టప్ రాజధానిగా హైదరాబాద్, తెలంగాణ స్టార్టప్ స్టేట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ దేశంలో స్టార్టప్ స్టేట్ అని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు. స్టార్టప్‌ల విషయంలో దేశంలోనే 2-3 స్థానంలో ఉన్న హైదరాబాద్.. త్వరలోనే స్టార్టప్‌ల రాజధానిగా ఎదుగుతుందన్నారు.

ప్రతిరోజూ ఏదో ఒక స్టార్టప్ కంపెనీ వినూత్న వ్యాపార ఆలోచనలతో ఐటీ శాఖను సంప్రదిస్తోందని, ఇటీవల ఓ పాఠశాలలో చదువుతున్న పిల్లలు సైతం స్టార్టప్ ఏర్పాటుకు ఉత్సాహం కనబర్చారన్నారు. తెలంగాణలోని స్మార్ట్ సిటీలకు పరిష్కారాలను అందించేలా స్టార్టప్‌లను ఒకే వేదిక పైకి తీసుకువచ్చేందుకు మైక్రోసాఫ్ట్.. స్మార్ట్‌సిటీ స్టార్టప్ కాంక్లేవ్‌ను ఏర్పాటు చేసింది.

మంగళవారం నాటి కార్యక్రమంలో కేటీఆర్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఇండియా పబ్లిక్ సెక్టార్ వ్యాపార విభాగ హెడ్ నీరజ్ గిల్, మైక్రోసాఫ్ట్ వెంచర్స్ విభాగ డైరెక్టర్ రవి నారాయణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు.

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

తెలంగాణ కొత్త రాష్ట్రమైనందున గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా సంక్రమించిన భారాలు ఏం లేవని, సరైన నియమాళి, వ్యూహాత్మక ప్రణాళికల ద్వారా ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించనుందన్నారు.

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

అయితే పాశ్చాత్య దేశాల సమస్యలతో పోలిస్తే మనం దేశీయంగా ఎదుర్కొంటున్న సవాళ్లు భిన్నమైనవని, వాటికి పరిష్కారాలను కూడా మనమే కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు.

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

పాశ్చాత్య ఆవిష్కరణలు మన దేశంలోని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించలేవన్నారు. అందుకే దేశీయ కంపెనీలే అంతర్గత సమస్యలకు తగ్గ పరిష్కారాలను కనిపెట్టాలని, స్టార్టప్‌లతోనే సాధ్యమన్నారు.

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

ప్రభుత్వంలోని ఇతర శాఖలు సాంకేతికపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సవాళ్లను పరిష్కరించేందుకు ఐటీ శాఖ అత్యంత చొరవ ప్రదర్శిస్తున్నదన్నారు. ఈ కాంక్లేవ్ ద్వారా 8 ప్రభుత్వ విభాగాల్లో కార్యకలాపాల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు అవసరమైన పరిష్కారాలు కనుగొనే దిశగా ప్రయత్నం మొదలైందన్నారు.

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

రాష్ట్ర ప్రభుత్వ అనుబంధంతో సంస్థ నిర్వహిస్తున్న మొట్టమొదటి స్టార్టప్ సదస్సు ఇదేనని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ సదస్సులో రవాణా, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, విద్యుత్, వాటర్ బోర్డు, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య, ఐటీ విభాగ అధికారులు పాల్గొని యంత్రాంగపరంగా ఎదురౌతున్న ఇబ్బందుల్ని స్టార్టప్‌లకు వివరించారని ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

మైక్రోసాఫ్ట్.. స్మార్ట్ సిటీ స్టార్టప్ కాంక్లేవ్

అలాగే ఈ విభాగాల్లో పరిష్కారాలను అందిస్తున్న 21 స్టార్టప్ కంపెనీలు.. తమ ఆవిష్కరణలపై ప్రభుత్వ అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. స్మార్ట్‌సిటీ స్టార్టప్‌లు అందిస్తున్న పరిష్కారాలతో కూడిన కాన్సెప్ట్ నోట్ యాక్సిలరేట్ ఇండియా - టెక్నాలజీ ఫర్ గ్రోత్‌ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.

జెఐసీఏతో

జెఐసీఏతో

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) ప్రతినిధులతో భేటీ అయ్యారు.

జెఐసీఏతో

జెఐసీఏతో

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) ప్రతినిధులతో భేటీ అయ్యారు.

English summary
Microsoft arranged a mega start-ups conclave Tuesday in Hyderabad to map cutting edge smart city solutions for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X