హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Munugode bypoll: ఆ మూడు పార్టీల సత్తాకు అగ్నిపరీక్ష..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. నియోజకవర్గంలోని 298 పోలింగ్‌ కేంద్రాల్లో 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేసింది.

ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి ప్రధాన పార్టీలన్నీ కసరత్తు పూర్తి చేశాయి. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్- హస్తగతం చేసుకోవడానికి టీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ పోలింగ్‌కు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ మీకోసం..

Munugode bypoll: Live updates of voting 7 vacant seats over 6 states including Telangana

Newest First Oldest First
12:52 PM, 3 Nov
ఢిల్లీ

మునుగోడు సహా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జోరుగా కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్.
11:55 AM, 3 Nov
తెలంగాణ

ఉదయం 11 గంటల వరకు మునుగోడులో 25.80 మేర పోలింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.
11:11 AM, 3 Nov
తెలంగాణ

నాంపల్లి మండలం టీపీ గౌరారంలో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న స్థానికులు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి సంబంధించిన అనుచరుల వాహనాల్లో డబ్బులు తీసుకొచ్చినట్లు ఆరోపణలు.
10:23 AM, 3 Nov
తెలంగాణ

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలం వడ్డేపల్లిలో పోలింగ్ స్టేషన్ సమీపంలో వివిధ పార్టీలు ఏర్పాటు చేసుకున్న టెంట్లను తొలగించిన పోలీసులు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోన్నారనే కారణంతో ఆయా పార్టీల కార్యకర్తలను బయటికి పంపించిన పోలీసులు.
10:21 AM, 3 Nov
తెలంగాణ

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మర్రిగూడలో నాన్ లోకల్స్ ఉన్నారంటూ ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలు. బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయింపు. వారిని చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.
9:59 AM, 3 Nov
తెలంగాణ

ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్న సమయంలో మునుగోడుకు వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్బంధించిన పోలీసులు.
9:51 AM, 3 Nov
తెలంగాణ

మునుగోడు నియోజకవరం ఉప ఎన్నిక పోలింగ్‌లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్.
9:49 AM, 3 Nov
మహారాష్ట్ర

అంధేరి ఈస్ట్ నియోజకవర్గానికి జోరుగా సాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్. పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
9:26 AM, 3 Nov
తెలంగాణ

మునుగోడు నియోజకవర్గానికి జోరుగా సాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్. నియోజకవర్గం పరిధిలోని తంగేడుపల్లి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు. వయోధిక వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు.
9:15 AM, 3 Nov
ఉత్తర్ ప్రదేశ్

గోలా గోకరనాథ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జోరుగా సాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్. గురునానక్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్న ఓటర్లు.
8:54 AM, 3 Nov
బీహార్

పాట్నా జిల్లాలోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గానికి జోరుగా సాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్. పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
8:47 AM, 3 Nov
తెలంగాణ

నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో తన ఓటు హక్కు వినియోగిచుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దంపతులు.
8:45 AM, 3 Nov
ఒడిషా

భద్రక్ జిల్లాలోని ధామ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జోరుగా సాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్. పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
8:32 AM, 3 Nov
తెలంగాణ

మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855. ఇందులో పురుషులు 1,21,720, మహిళలు- 1,20,128 మంది ఉన్నారు. 298 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.
7:26 AM, 3 Nov
తెలంగాణ

మునుగోడు మండలంలో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. రెండు లక్షలమందికి పైగా ఓటర్లు తమ ఇవ్వాళ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
7:20 AM, 3 Nov
తెలంగాణ

మునుగోడుకు వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
7:15 AM, 3 Nov
ఢిల్లీ

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు.
7:10 AM, 3 Nov
బీహార్

మొకామా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.
7:02 AM, 3 Nov
తెలంగాణ

నల్లగొండ జిల్లా మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నియోజకవర్గం పరిధిలోని తగడపల్లిలో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తోన్న ఎన్నికల అధికారులు. ఈ పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
10:19 PM, 2 Nov

హర్యానాలోని ఆదంపూర్, మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్‌లోని గోపాల్‌గంజ్, మొక్మా, ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్‌లల్లో ఉప ఎన్నికలను నిర్వహించడానికి ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
10:17 PM, 2 Nov
ఢిల్లీ

తెలంగాణలోని మునుగోడుతో పాటు ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. 6వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
10:14 PM, 2 Nov
తెలంగాణ

నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది.

English summary
Munugode bypoll: Live updates of voting 7 vacant seats over 6 states including Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X