బొలెరో బోల్తా: ఆరుగురు మృతి, 15మందికి గాయాలు

Subscribe to Oneindia Telugu
  ఘోర రోడ్డుప్రమాదం, వీడియో !

  జోగులాంబ గద్వాల: జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, మరో 15 మంది గాయపడ్డారు. చిన్నపాడు గ్రామానికి చెందిన కూలీలు గద్వాల పట్టణంలోని ఓ మిల్లులో పనిచేస్తున్నారు.

  ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించుకున్న వారు బొలెరో వాహనంలో స్వగ్రామానికి తిరిగి పయనమయ్యారు. పారిచెర్ల వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.

  road accident in chinnapadu: five dead

  ఈ ఘటనలో చిన్నపాడు గ్రామానికి చెందిన కొత్త వెంకటన్న, కోట్ల వెంకటన్న, కమ్మరి లోహిత్‌, కమ్మరి గీతమ్మ, ఎమునంపల్లి గ్రామానికి చెందిన అరుణమ్మ ఉన్నారు. క్షతగాత్రులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని గద్వాల డీఎస్పీ సురేంద్రరావు పరిశీలించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Five killed in a raod accident, which occurred in Jogulamba Gadwala district on Sunday night.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి