శివత్వం,హిందూత్వం అద్బుతంగా చూపించారు.!అఖండ అందరూ చూడాలంటున్న హిందు ఫాన్స్.!

హైదరాబాద్ : అఖండ సినిమా హిట్టయ్యిందా పట్టయ్యిందా అనే విషయం పక్కన పెడితే ఆ పినిమాను ప్రతి హిందువూ చూడాలనే విజ్ఞప్తులు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. అఖండ సినిమాలో శివత్వాన్ని అద్బుతంగా చూపించారని, హింసకు అహింసకు ఉన్న తేడాను కూడా కళ్లకు కట్టినట్టు చూపించారని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఒక చెంపమీద కొడితే రెండో చెంప చూపించే కాలం ఎప్పుడో పోయిందని, చెంప కోడితే గుండెల్లో త్రిశూలం దించే రోజులు వచ్చాయని సగటు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

అఖండ అందరి కోసం.. ప్రతి హిందువు చూడాలంటున్న ప్రేక్షకులు

అఖండ అందరి కోసం.. ప్రతి హిందువు చూడాలంటున్న ప్రేక్షకులు

అదే అంశాన్ని అఖండ సినిమాలో అద్బుతంగా చూపించారని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. అన్నిటికి మించి హిందూత్వానికి మరింత గౌరవాన్ని పెంచే క్రమంలో శివును సన్నివేశాలను దర్శకుడు బ్రహ్మాండంగా చత్రీకరించారనే చర్చ కూడా జరుగుతోంది. బూజు పట్టిన సిద్దాంతాలను పట్టుకుని ఇంకెన్నాళ్లు వేళాడాలని, కొత్తదనం కోసం, శివుడి పరాక్రమం తెలుసుకోవడం కోసం అఖండ సినిమాను హిందువులందరూ ఆదరించాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.

హిందూ ఇతివృత్తంతో అఖండ.. బోయపాటి అద్బుతంగా తీసాడంటున్న తటస్థ ప్రేక్షకులు

హిందూ ఇతివృత్తంతో అఖండ.. బోయపాటి అద్బుతంగా తీసాడంటున్న తటస్థ ప్రేక్షకులు

తెలుగు దర్శకులు మంచి హిందుత్వ ఇతివృత్తంతో సినిమాలు తీయడం మొదలు పెట్టారని, ఇది రాబోవు తరాలకు మంచి శుభసూచకమని బాలయ్య అభిమానులు కాకుండా అఖండ సినిమా చూసిన తటస్థ ప్రేక్షకులు స్పష్టం చేస్తున్నారు. అద్భుతమైన దర్శకత్వ విలువలున్న సినిమా అఖండ అని, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కు ధన్యవాదాలంటూ ప్రంశంసలు హోరెత్తుతున్నాయి. సినిమా కోసం కష్ట పడిన యూనిట్ ను దృష్టిలో ఉంచుకుని పైరసీ సినిమా కాకుండా ఒరిజినల్ సినిమా చూడాలని అభిమానులు విజ్ఙప్తి చేస్తున్నారు.

దుష్టశిక్షణ కోసం శివ తాండవం.. శివత్వాన్ని గొప్పగా చత్రీకరించారంటున్న సినిమా పాన్స్

దుష్టశిక్షణ కోసం శివ తాండవం.. శివత్వాన్ని గొప్పగా చత్రీకరించారంటున్న సినిమా పాన్స్

విమర్శలు చేయాలి అనుకుంటే లిప్ లాక్ సీన్స్ ఉన్న సినిమాల మీద చేయండి కాని అఖండ సినిమా మీద విమర్శలు వద్దని ప్రేక్షకులు కోరుతున్నారు. అఖండ సినిమా చాలా వైవిద్యంగా తీశారని, బాలకృష్ణ నటన, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం అద్భుతంగా ఉన్నయంటున్నారు ప్రేక్షకులు. శివ తత్వాన్ని బాగా చూపించారని, అహింసా పరమో ధర్మః, ధర్మ హింస తదైవచ, అర్ధాన్ని చక్కగా ఈ చిత్రంలో వివరించారనే ప్రశంలు వినిపిస్తున్నాయి.

ప్రతి హిందువూ చూడాలి.. అఖండకు పెరుగుతున్న ఆధరణ

ప్రతి హిందువూ చూడాలి.. అఖండకు పెరుగుతున్న ఆధరణ

హిందూ ధర్మానికి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, తెగ నరకమనే ధర్మం చెబుతుంది కానీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని ఏ పురాణాల్లో లేదని చెప్పుకొస్తున్నారు. దిక్కుమాలిన శాంతి పదాలు హిందువులకు అలవాటు చేసి, ధర్మం నాశనం అయ్యేలా చేసాయని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. హిందూ దర్మంతో పాటు వీరోచిత శివ తాండవం గురించి తెలుసుకోవాలంటే అఖండ చూడాలనే డిమండ్ లు వినిపిస్తున్నాయి. బాలయ్య అభిమానులే కాకుండా హిందూబందువులందరూ ఈ సినిమా చూడాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+