కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యోగా ఛాంపియన్‌: వరుసగా 10 సార్లు ఒకే జిల్లాకు చాంపియన్ షిప్

మూడు రోజుల పాటు కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కరీంనగర్‌ జిల్లా ఓవరాల్‌ ఛాంపియన్‌ సాధించింది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: మూడు రోజుల పాటు కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కరీంనగర్‌ జిల్లా ఓవరాల్‌ ఛాంపియన్‌ సాధించింది. ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్‌, తృతీయ స్థానంలో వరంగల్‌ జిల్లా నిలిచింది.

తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి 400 మంది బాలబాలికలు పోటీలకు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి మేయర్‌ రవిందర్‌సింగ్‌ హాజరై గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందజేశారు.రాష్ట్ర పోటీల సందర్భంగా అండర్‌ 8-11, 11-14, 14-17, 17-21, 21-25, 25-35, 35+ విభాగం బాలబాలికలకు, పురుషులు,మహిళలకు పోటీలు నిర్వహించారు.

Yoga champion karimnagar: Tenth time

113 పాయింట్లతో కరీంనగర్‌ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి 3 బంగారు, 5 రజత, 8 కాంస్య, 69 పాయింట్లతో మహబూబ్‌నగర్‌ ద్వితీయ స్థానంలో నిలిచి 5 బంగారు, 4 రజత, 1 కాంస్య, 42 పాయింట్లతో వరంగల్‌ తృతీయ స్థానంలో నిలిచి 4 బంగారు, 1 కాంస్య పతకాలను సాధించారు.

రాష్ట్ర పోటీల్లో 10 సార్లు ఛాంపియన్‌ - రవీందర్‌సింగ్‌, మేయర్‌

పదకొండేళ్ల కాలంలో పది సార్లు రాష్ట్ర యోగా పోటీల్లో కరీంనగర్‌ జట్టు ఛాంపియన్‌గా నిలవడం అభినందనీయమని మేయర్‌ రవీందర్‌సింగ్‌ పేర్కొన్నారు. పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక్క సంవత్సరం మినహా పది సంవత్సరాలు విజేతగా నిలిచి కొత్త రికార్డు నమోదు చేసిందని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోటీలను ఘనంగా నిర్వహించామని.. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన మాదిరిగానే, జాతీయస్థాయి పోటీలను కరీంనగర్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Yoga champion karimnagar: Tenth time

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌రావు, జాతీయ యోగా ఫెడరేషన్‌ సభ్యులు భరత్‌భూషణ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, ఒలంపిక్‌ సంఘం కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఎస్‌.జి.ఎఫ్‌.కార్యదర్శి నర్సయ్య, జిల్లా కార్యదర్శి ఎన్‌.సిద్దారెడ్డి, పెటా సంఘం అధ్యక్ష కార్యదర్శులు రవి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ ద్వితీయ, వరంగల్‌ తృతీయ

ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు : మూడు రోజుల పాటు కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కరీంనగర్‌ జిల్లా ఓవరాల్‌ ఛాంపియన్‌ సాధించింది. ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్‌, తృతీయ స్థానంలో వరంగల్‌ జిల్లా నిలిచింది. 10 ఉమ్మడి జిల్లాల నుంచి 400 మంది బాలబాలికలు పోటీలకు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి మేయర్‌ రవిందర్‌సింగ్‌ హాజరై గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందజేశారు.

English summary
Karimnagar district won the Telangan statewide Yoga champianship trophy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X