హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేరా కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Chekuri Rama Rao
హైదరాబాద్: చేరాగా సుప్రసిద్ధుడైన ప్రముఖ సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు గురువారంనాడు కన్ను మూశారు. ఆయనకు 80 ఏళ్లు తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడుగా పరిచయమైన చేకూరి రామారావు ప్రధానంగా భాషాశాస్త్రంలో శిక్షణ పొంది మౌలిక పరిశోధన చేశారు.

ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యుడయ్యాడు. ఆయన అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుండి ఎం. ఏ., పి.హెచ్.డి. డిగ్రీలు పొందాడు.

ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహూకరించింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆయన రాసిన చేరాతలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. చేకూరి రామారావు 1934 అక్టోబర్‌లో ఖమ్మం జిల్లా మథిర సమీపంలోని ఇల్లిందలపాడు గ్రామంలో జన్మించారు.

తెలుగు వాక్యం, వచన పద్యం: లక్షణ చర్చ, రెండు పదుల పైన, తెలుగులో వెలుగులు (భాషా పరిశోధన వ్యాసాలు), చేరాతలు సాహిత్య విమర్శ - పరామర్శ, చేరా పీఠికలు, ముత్యాల సరాల ముచ్చట్లు, ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం, స్మృతికిణాంకం, భాషానువర్తనం, భాషాంతరంగం, సాహిత్య వ్యాస రింఛోళి, కవిత్వానుభవం, వచన రచన తత్త్వాన్వేషణ, సాహిత్య కిర్మీరం, భాషా పరివేషం అనే రచనలు చేశారు.

English summary
An eminent Telugu literray critic Chekuri Rama Rao passed away in Hyderabad. He is known as Chera. Chekuri Rama Rao was born on October, 1 1934 in illindalapadu village near Madhira, Khamma District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X