IPL 2026: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ప్రకటన-కమ్మిన్స్ స్ధానంలో..!
ఈ నెలాఖరులో ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభమవుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టోర్నీలో ఆరంభ మ్యాచ్ లకు దూరమవుతున్న నేపథ్యంలో అతని స్ధానంలో తాత్కాలిక కెప్టెన్ కు ప్రకటించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (ishan kishan)ను కెప్టెన్ గా సన్ రైజర్స్ అవకాశం కల్పించింది. ఇప్పటికే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న ఇషాన్ కిషన్ కు పలు జట్లకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2026లోని తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న కమ్మిన్స్.. ఐపీఎల్ లో ఆలస్యంగా చేరే అవకాశం ఉంది. గాయం కారణంగా ఇప్పటికే యాషెస్ టెస్టుల్లో ఒకదానిలో మాత్రమే ఆడిన కమ్మిన్స్.. తాజాగా టీ20 ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీంతో కమ్మిన్స్ గైర్హాజరీలో సన్ రైజర్స్ జట్టుకు ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇషాన్ కిషన్ కెప్టెన్ గా , మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. తాజాగా వరల్డ్ కప్ లో కిషన్ అద్బుత ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే దేశవాళీ టోర్నీల్లోనూ సత్తా చాటుకున్నాడు. జార్ఖండ్ తమ తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడంలో కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇది అతనికి 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టులోకి తిరిగి రావడానికి కూడా పనికొచ్చింది.
-
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
ఆర్సీబీకి ఉత్తి పుణ్యానికి రూ. 16,706 కోట్లు -
వాల్‌మార్ట్ చేతికి రాజస్థాన్ రాయల్స్: రూ.15,300 కోట్లు, సింగిల్ పేమెంట్: ఎవరీ సొమానీ? -
RCB సంచలన నిర్ణయం- ఇక ప్రతీ మ్యాచ్ కూ స్టేడియంలో ఆ 11 సీట్లు రిజర్వ్..! -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇంగ్లండ్ స్టార్ సడన్ గుడ్ బై-నిషేధం తప్పదా ? -
రేసు గుర్రాన్ని పక్కన పెట్టిన ఆర్సీబీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!














Click it and Unblock the Notifications