వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగస్టా స్కాం: రాష్ట్రంతో లింకేంటి, వైయస్ పేరెందుకు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Augusta links with AP
అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ మకిలి జాడలు ఎపిలో కనిపిస్తున్నాయనే విమర్శలు జోరుగా వస్తున్నాయి. ఇటీవల అగస్టా కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది మరో బోఫోర్స్ కుంభకోణం అని విపక్షాలు, దాని నుండి ఎలా బయటపడాలా? అని కేంద్రం ఆలోచిస్తోంది. అయితే, ఇదే అగస్టా కుంభకోణం ముడుపుల వ్యవహారంలో ఆంధ్ర ప్రదేశ్ పాత్ర ఉందనే ఆరోపణలో జోరందుకున్నాయి.

ఈ కంపెనీకి సంబంధించిన అగస్టా హెలికాప్టర్‌నే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కోట్ల రూపాయల డబ్బును చెల్లించి కొనుగోలు చేసింది. ఇక, ఈ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న గిడోరాల్ఫ్ హష్కే.. ఎమ్మార్ ఎంజిఎప్ సంస్థలో మూడు నెలల పాటు 2009లో డైరెక్టర్‌గా పని చేశాడు. ఎమ్మార్ అవినీతి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకెత్తించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కార్లో గెగోసాల పేరు కూడా ఈ స్కాంలో వినిపిస్తోంది.

వందలవేల కోట్ల రూపాయల హెలికాప్టర్ల డీల్స్ కుదిర్చిపెట్టిన గెరోసా ఖమ్మంలోని 'అర్బోర్ చారిటబుల్ ఫౌండేషన్'లో డైరెక్టర్‌గా పని చేశారు. అర్బోర్ అనేది ఓ అంతర్జాతీయ సేవా సంస్థ. స్విట్జర్లాండ్ కేంద్రంగా నడుస్తోంది. ఇటలీలో ఈ సంస్థ కార్యాలయం ఉంది.2006లో ఈ సంస్థ ఖమ్మం జిల్లాలోనూ అర్బోర్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆసక్తి ప్రదర్శించారు. అప్పట్లో ఖమ్మం బిషప్ మైపాన్‌ను కలిసి ఈ విషయం తెలిపారు.

బిషప్ మైపాన్ అర్బోర్ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను సిస్టర్ డైసీ, సిస్టర్ మోలీలకు అప్పగించారు. ఇదే అర్బోర్ ఫౌండేషన్‌లో 2008 మార్చిలో గెరోసా డైరెక్టర్‌గా చేరారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదిరిన నెల తర్వాత అంటే 2010 మార్చిలో అర్బోర్‌తో ఆయన బంధం తెగిపోవడం గమనార్హం. ఖమ్మంలో అర్బోర్ ఫౌండేషన్ ఏర్పాటు కాకమునుపే సిస్టర్ డైసీతో వైయస్ కుటుంబానికి మతపరమైన సంబంధాలున్నాయట.

పాదయాత్ర సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చిన వైయస్.. సిస్టర్ డైసీకి చెందిన సంస్థ నిర్వహించే పాఠశాలలో బస చేశారు. ఇక.. 2009 ఎన్నికల ముందు వైయస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ అర్బోర్‌తో సంబంధమున్న మత బోధకులతో కలిసి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలంటూ ప్రసంగించి కోడ్ కూడా ఉల్లంఘించారు. దీనిపై కేసు కూడా నమోదైంది. వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక అధికార యంత్రాంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా అర్బోర్‌కు ఎంతో సహకరించిందని ఆరోపిస్తున్నారు. ఇదే అర్బోర్‌తో సంబంధాలున్న గెగోసా అగస్టా వె‌స్ట్‌ల్యాండ్ డీల్‌లో మధ్యవర్తిగా వ్యవహరించారు.

English summary
Augusta links with AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X