వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుమ్ములతో ముక్కు కారుతూంటే ...తాగండి వేడి చికెన్ సూప్!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Cough and Cold spreads to others easily
తుమ్ములతో ముక్కు కారిపోతూ ఉంటే చికెన్ సూప్ కంటే మించింది లేదని కొందరు చెపుతారు. మరి కొందరు అల్లం, తేనె కలిపిన టీ, నిమ్మకాయ పనిచేస్తుందంటారు. అయితే సాధారణ జలుబు అయినా, దానిపట్ల మరింతగా శ్రధ్ధ వహించవలసిందే.

తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి లేదా స్కూళ్లకు వెళ్ళడం సరైంది కాదు. అలాగే తల, శరీరం నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నపుడు, తుమ్ములతో జలుబు మొదలైనపుడు పారాసిటమాల్ వంటి బిళ్ళలు, వేపోరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదు.

ఆయా సీజన్లలో వచ్చే జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా కూడా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసి తుమ్మినపుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకేట్లు చేస్తాయి. అందుకని జలుబు చేసినపుడు బయటకు వెళ్ళి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెపుతారు.

జలుబు సాధారణంగా 7 నుంచి 12 రోజులలో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వేడి నీటిలో పసుపు లేదా ఏదైనా బామ్ వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

చీదినప్పుడు, దగ్గినపుడు రక్తం పడుతోందా...అని కూడా గమనించాలి. అలా రక్తం కనుక పడితే అది తీవ్రమైన జబ్బుగా గమనించాలి. స్వల్పంగా తలనొప్పి, జలుబు అయినపుడు తగినంత విశ్రాంతి అన్నిటికంటే మంచిది.

English summary
Generally cold gets treated in 7 days to 12 days. For these viral diseases, rather than using anti-biotics, taking rest is ideal. While coughing, one should observe for any blood coming out. If it is so, that could be a serious one. For headaches, cold, etc. taking sufficient rest is advisable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X