అక్కడ భేటీ: కేసీఆర్-చంద్రబాబుల మధ్య రేవంత్ రెడ్డి చర్చ?

Posted By:
Subscribe to Oneindia Telugu
  కేసీఆర్-చంద్రబాబుల మధ్య రేవంత్ రెడ్డి : రాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు | Oneindia Telugu

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల మధ్య గురువారం.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఇష్యూ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

  కేసీఆర్‌కు కొత్త చిక్కు: రాజీనామా ఆమోదిస్తే రేవంత్ గట్టి షాకివ్వక తప్పదు?

  మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

  మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా హైదరాబాదులోని రాజ్ భవన్‌కు వచ్చారు.

   శుభకార్యక్రమానికి హాజరు

  శుభకార్యక్రమానికి హాజరు

  తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి ఇటీవల కన్నుమూశారు. ఆమె మృతి చెంది 13 రోజులు అయిన సందర్భంగా శుభస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల సీఎంలు వచ్చారు.

   చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య చర్చ

  చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య చర్చ

  రాజ్ భవన్‌లో శుభ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

   రేవంత్ రెడ్డి, శాసన సభ సమావేశాల పైనా

  రేవంత్ రెడ్డి, శాసన సభ సమావేశాల పైనా

  అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి గురించి చర్చ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే, శాసన సభ సమావేశాలపై కూడా చర్చించుకున్నారట.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kodangal MLA Revanth Reddy issue between Telangana Chief Minister KCR and Andhra Pradesh Chief Minister Chandrababu Naidu in Raj Bhavan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి